E-Paper
Advertisement

కోనసీమ జిల్లాలో దారుణం.. భారీ వర్షానికి ఇంటి స్లాబ్ కూలి మహిళ మృతి!

కోనసీమ జిల్లాలో దారుణం.. భారీ వర్షానికి ఇంటి స్లాబ్ కూలి మహిళ మృతి!
Advertisement

Roof Collapse: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం వూరపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి స్లాబ్ కూలి మహిళ మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామం ఊరపేట ప్రాంతంలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఇంటి స్లాబ్ కూలిపోవడంతో ఓ మహిళ మృతి చెందగా, ఆమె భర్త, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు.

మహిళ అక్కడికక్కడే మృతి..

గ్రామలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షానికి ఇంటి స్లాబ్ ఒక్కసారిగా కూలిపోవడంతో కొల్లు సత్యవతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఆమె భర్త, కుమారుడు తీవ్రంగా గాయపడగా, వారిని అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఊరపేట ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Also Read: NEET Counselling: నీట్ 2026 కౌన్సిలింగ్.. ఎంబిబిఎస్ అడ్మిషన్ స్టేట్ కోటాకు మీకు అర్హత ఉందా?

30 సంవత్సరాల క్రితం..

సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై ఉప్పలగుప్తం సబ్‌ ఇన్‌స్పెక్టర్ జానీ భాష మాట్లాడుతూ.. సుమారు 30 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ సంస్థ నిర్మించిన ఈ ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. ఇంటి నిర్మాణం బలహీనపడటంతో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయి కొల్లు సత్యవతి మృతి చెందినట్లు అధికారులు వివరించారు. ఈ ఘటనపై స్థానిక తహసీల్దార్ అశోక్‌తో పాటు అధికారులు విచారణ చేపట్టి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Also Read: ప్రయాణికులకు అలర్ట్.. రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఆగస్టు 1 నుంచి కొత్త ‘తత్కాల్’ రూల్స్!

Related News

రామాలయ వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామ!

ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. రూ.281 కోట్ల నిధులు విడుదల!

నేనేంటో చంద్రబాబుకు తెలుసు.. భయపడే రకాన్ని కాదు: బోండా ఉమా హాట్ కామెంట్స్!

షేవింగ్ బ్లేడుతో.. భర్తను అతి దారుణంగా చంపిన భార్య!

బొండా ఉమకు షోకాజ్ నోటీస్.. చంద్రబాబుపై అంబటి సంచలన కామెంట్స్!

డీఎస్సీపై అసత్యాలు చెప్తే ఊరుకోం.. బొత్స వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కొండపల్లి!

శివానీ మృతిపై.. ఎమోషనల్ అయిన సీఎం చంద్రబాబు!

Big Stories

Advertisement
×