Jainoor tensions: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనూర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అక్కడ పోలీసులు కర్ఫ్యూతోపాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆదివాసీ మహిళపై ఓ ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కారణంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
జైనూర్‌లో అసలేం జరిగింది? డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం.. జైనూరు మండలం దేవుగూడకు చెందిన 45 ఏళ్ల ఆదివాసీ మహిళపై ఓ ఆటోడ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.. తీవ్రంగా గాయపరిచాడు. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలియగానే ఆదివాసీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
ALSO READ: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. దంచికొడుతున్న భారీ వర్షం
సిర్పూర్, జైనూర్, లింగాపూర్ మండలాల్లో నిరసన చేపట్టారు. ఆగ్రహానికి గురైన ఆదివాసీలు నిందితుడి ఇంటికి ధ్వంసం చేశారు. దీంతో జైనూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. రెచ్చిపోయిన ఆందోళనకారులు మార్కెట్‌లో తోపుడు బళ్లకు నిప్పుపెట్టారు. సామాగ్రిని రోడ్డుపై పడేశారు. ఆ మంటలు కాస్త రోడ్డుపక్కనున్న షాపులకు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులతోపాటు ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగారు. మంటలకు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి.
పరిస్థితి గమనించిన పోలీసులు 144 సెక్షన్ విధించారు. బయటి వ్యక్తులు జైనూరుకు వెళ్లడానికి అనుమతి లేదని జిల్లా ఎస్పీ తేల్చిచెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ఫేక్ ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో ప్రజలంతా సమన్వయం పాటించాలన్నారు.
ఘటనకు కారకుడైన నిందితుడిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఏమాత్రం నమ్మవద్దని కోరారు. జైనూర్ టౌన్ చుట్టూ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జుపటేల్ పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి మహిళ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచన చేశారు.
ఆగస్టు 31న ఘటన జరిగితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఈ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్.. డీజీపీకి ఫోన్ చేశారు. మహిళపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు మగ్దూంకు శిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
జైనూరులో 144 సెక్షన్
ఆదిలాబాద్: జైనూరులో 144 సెక్షన్ అమలు.. పోలీసుల పికెటింగ్ ఏర్పాటు.
అల్లర్లు పునరావృతం కాకుండా భారీగా బలగాల మోహరింపు.
అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు.#Adilabad #Jainoor #Telangana #NewsUpdates #Bigtv pic.twitter.com/ypaKF13DUK
— BIG TV Breaking News (@bigtvtelugu) September 5, 2024