BigTV English

Telugu Celebrity League: వెండితెర, బుల్లితెర స్టార్స్ తో క్రికెట్ లీగ్.. హైదరాబాదీలకు పండుగే..

Telugu Celebrity League: వెండితెర, బుల్లితెర స్టార్స్ తో క్రికెట్ లీగ్.. హైదరాబాదీలకు పండుగే..

Celebrity Cricket league 2024 in Hyderabad: క్రికెట్.. ఇండియాలో ఓ మతం. అందుకే గల్లీ నుంచి ఇంటర్నేషనల్ స్టేడియాల వరకు అన్ని వర్గాల ప్రజలు ఆడుతుంటారు క్రికెట్‌ని. అయితే వీరందరి కాంబోలో మరో క్రికెట్ లీగ్ రాబోతుంది. మొదటిసారి హైదరాబాద్ లో ఈ అద్భుతం జరగబోతోంది. తెలుగు సెలబ్రెటీ లీగ్ పేరుతో సరికొత్త టోర్ని రాబోతుంది. ఇందులో మూవీ ఆర్టిస్ట్స్, టెలివిజన్ స్టార్స్, పొలిటిషియన్స్‌తో పాటు.. హైర్యాంక్‌ పోలీస్‌ ఆఫిషియల్స్‌ ఉండనున్నారు.


ఇప్పటికే ఈ లీగ్ కు సంబంధించిన టీమ్‌ ఫార్మాట్‌ డిసైడ్ అయ్యింది. ఈ లీగ్‌లో ఐదు టీమ్స్ ఉండనున్నాయి. పోలీస్‌ వారియర్స్, మూవీ ఐకాన్స్, టీవీ ఆర్టిస్స్, టాప్‌ టెక్నిషియన్స్.. పొలిటికల్ వారియర్స్ ఇలా ఐదు టీమ్స్ తలపడనున్నాయి. లీగ్‌ మ్యాచ్‌ల్లో టాప్‌లో నిలిచిన రెండు టీమ్స్‌ ఫైనల్స్‌లో తలపడనున్నాయి. ఫైనల్‌తో కలిపి మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడనున్నాయి టీమ్స్.. ప్లేయర్స్‌లో పోలీస్ కమిషనర్స్‌ నుంచి.. ఫేమస్ మూవీ డైరెక్టర్స్‌, ఆర్టిస్ట్స్‌లు ఉన్నారు. ఫైనల్స్‌లో గెలిచిన వారికి 3 లక్షల రివార్డ్‌, రన్నరప్‌ టీమ్‌కు లక్ష రూపాయల రివార్డ్ అందించనున్నారు.

అయితే ఇందులో వినోదంతో పాటు.. మంచి సందేశం కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. సే నో టు డ్రగ్స్.. ఇదే థీమ్‌ అండ్ మెసేజ్‌తో ఈ లీగ్‌ ఆడనున్నారు. డ్రగ్స్‌ వ్యతిరేక పోరాటంలో మేము సైతం అంటూ దానికి ఈ లీగ్‌ను వేదికగా చేసుకోనున్నారు. అలాగే ఈ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌కు బిగ్‌టీవీ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.


Also Read: ఐపీఎల్‌ జట్లకు BCCI గుడ్‌ న్యూస్‌..తెరపైకి కొత్త 4+2 రిటెన్షన్ పాల‌సీ…?

ఈ లీగ్‌ ఫస్ట్‌ ఎడిషన్‌ అక్టోబర్ రెండు, మూడు రోజుల్లో జరగనుంది. అజీజ్ నగర్‌లోని MRR క్రికెట్‌ గ్రౌండ్‌లో ఈ మ్యాచేస్‌ జరగనున్నాయి. ఇప్పటికే గ్రౌండ్ లోకి దిగిన ప్లేయర్లు ప్రాక్టీస్ మొదలు పెట్టారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×