Ex Minister Rk Roja: మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు. ప్రతి నెల చంద్రబాబు ఒకటే పథకాన్ని ప్రారంభిస్తారంటూ విమర్శలు గుప్పించారు. 143 హామీలతో ప్రజలను మభ్యపెట్టి 11 నెలల్లో ఒకటి కూడా అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. టీడీపీ పాలనలో అబద్ధాలు, మోసాలే కనిపిస్తున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ఫించన్ తప్పా ఇచ్చిన వాగ్ధానాలు ఏమి నెరవేర్చలేదని మండిపడ్డారు. ఒక్క ఏడాదిలోనే లక్షా రూ.52 వేల కోట్లు అప్పులు చేయడేమానా పాలనా అంటూ రోజా ఫైర్ అయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడే మాటలకు.. చేసే పనులకు ఏమైనా సంబందం ఉందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ఆర్కే రోజా. ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు.. కరువును మేనేజ్ చేయలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పెట్రోల్ పంపుల దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము లోకేష్‌కు ఉందా అంటూ ఆర్కే రోజా సవాల్ విసిరారు.
అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ క్లీయర్ కట్‌గా ఇవ్వడం జరిగంది. ఐదు లక్షల ఛేంజ్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి దిగిపోయేనాటికి అప్పులు ఉన్నాయని తెలిపారు. జగన్ కేవలం రూ.3లక్షల 39 కోట్లు మాత్రమే అప్పు చేశారని ఆమె అన్నారు.
Als Read: బయటపడ్డ మరో సీసీటీవీ ఫుటేజ్.. లారీ, బస్సు మధ్యలో పాస్టర్ ప్రవీణ్
వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్ ఒకటో తేదీనా సీఎం చంద్రబాబు ఫూల్ చేయడం.. ఇక్కడే చూస్తున్నాం అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. మేనిఫెస్టోలో ఉన్న పథకాల్లో కేవలం ఫెన్షన్లు మాత్రమే ఇస్తున్నారని.. హామీలు జనాలను ఫూల్స్ చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు భరోసా లేదు, గిట్టుబాటు ధర అసలే లేదు.. మీరందరు అబద్దాలు మాట్లాడి.. ఎల్లో మీడియాలో అబద్దాలు చెప్పించి అధికారంలోకి వచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో గంజాయి పండిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.