BigTV English

Madhumitha : శివ బాలాజీ భార్య యూట్యూబ్ పెట్టడానికి ఆ బెదిరింపులే కారణమా ?

Madhumitha : శివ బాలాజీ భార్య యూట్యూబ్ పెట్టడానికి ఆ బెదిరింపులే కారణమా ?

Madhumitha : ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించిన నటి మధుమిత (Actress Madhumitha). ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె తన ఇంట్లో వండుకునే రకరకాల వంటలతో పాటు జర్నీ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తుంది. అయితే మధుమిత ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టడం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. కొంతమంది బెదిరింపుల కారణంగానే తాను యూట్యూబ్ ఛానల్ పెట్టాల్సి వచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఈ అమ్మడు. మరి మధుమితను బెదిరించే ధైర్యం చేసింది ఎవరు? అసలు ఆమె యూట్యూబ్ ఛానల్ వెనుక ఉన్న స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…


బెదిరింపుల వల్లే యూట్యూబ్ 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మధుమిత తన భర్త, నటుడు శివ బాలాజీ (Siva Balaji) తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన యూట్యూబ్ ఛానల్ గురించి మధుమిత మాట్లాడుతూ నిజానికి తానసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకోలేదని చెప్పింది. “కరోనా టైంలో ప్రతి ఒక్కరూ చనిపోతామేమో అని ప్యానిక్ అయ్యారు. కానీ మేము మాత్రం ఫ్యామిలీ అంతా కలిసి స్పెండ్ చేసే టైం దొరికిందని సంతోషపడ్డాం. ఆ టైంలో యూట్యూబ్ పెట్టలేదు గానీ, ఫేస్బుక్, ఇంస్టాలో మా వీడియోలను షేర్ చేసేవాళ్లం. ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలను మాత్రమే కాకుండా కరోనా వల్ల భయపడొద్దని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను వెల్లడించే వాళ్ళం.


అయితే ఆ టైంలో కొంతమంది యూట్యూబ్ పెట్టమని కామెంట్ చేశారు. కానీ అప్పటికే యూట్యూబ్ అంటే మంచి అభిప్రాయం లేకపోవడం వల్ల నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత మీ వీడియోలను మేము వెతుక్కోవాలా? యూట్యూబ్ పెట్టమని ఎన్నిసార్లు అడగాలి? అనే కామెంట్స్ వార్నింగ్ మోడ్లో వినిపించాయి. దీంతో వెంటనే యూట్యూబ్ పెట్టేసి అందులో పోస్ట్ చేయడం మొదలు పెట్టాము. ఇక యూట్యూబ్ అనేది మా లైఫ్ బుక్ లాంటిది. 80-90 ఏళ్ళు వచ్చాక మేమేంటో అని తిరిగి చూసుకుంటే ఒక్కో వీడియోలో ఒక్కో మెమొరీ ఉంటుంది” అంటూ తన యూట్యూబ్ పెట్టడానికి గల కారణం ఏంటో వెల్లడించింది.

పెళ్లయ్యాక సినిమాలకు దూరం 

ఇక మధుమిత అసలు పేరు స్వప్న మాధురి. ఆమె తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించింది. 2002లో ‘సందడే సందడి’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘పుట్టింటికి రా చెల్లి’ సినిమాలో ఆమె అర్జున్ చెల్లి పాత్రను పోషించింది. ఈ సినిమాలో మధు పాత్రకి మంచి గుర్తింపు దక్కింది. ముందు హీరోయిన్ పాత్రలు చేసిన మధుమిత ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. కానీ పెళ్లయ్యాక పూర్తిగా సినిమాలకు దూరమైంది. ‘వినయ విధేయ రామ’ సినిమాలో చివరిసారిగా కనిపించింది మధుమిత. శివ బాలాజీని 2009 మార్చ్ 1 లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఈ జంటకు ఇప్పుడు ఇద్దరు కొడుకులు ధన్విన్ కంగుల, గగన్ కంగులా ఉన్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×