Henna For White Hair: సహజంగా జుట్టుకు రంగు వేయడానికి మెహందీని చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు హెన్నాను అప్లై చేసిన తర్వాత కూడా పెద్దగా తేడా కనిపించదు. ఒక్కో సారి హెన్నా అప్లై చేసిప్పుడు జుట్టు రంగు పూర్తిగా మారదు. కొంత మంది హెన్నా అప్లై చేసినప్పుడు జుట్టు రాలే ప్రమాదం కూడా ఉంటుంది. అంతే కాకుండా పొడిగా కూడా మారుతుంది. దీనికి ప్రధాన కారణం జుట్టుకు హెన్నా వాడేటప్పుడు చేసే పొరపాట్లే. అందుకే జుట్టుకు హెన్నాను అప్లై చేసేటప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. వాటి గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వేడి నీటిని ఉపయోగించండి:
హెన్నాను జుట్టుకు అప్లై చేయడం కోసం ముందుగా హెన్నా పౌడర్‌ను సాధారణ నీటిలో కలపడానికి బదులుగా ఇందుకోసం వేడి నీటిని ఉపయోగించండి. ఒకటి, రెండు చెంచాల టీ పౌడర్‌ను ఒక నిమిషం పాటు నీటిలో ఉడకబెట్టి దానిని హెన్నాలో వేసి కరిగించండి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని 12 గంటలు నానబెట్టండి.
హెన్నాను జుట్టుకు పట్టించాలంటే కనీసం 12 గంటల పాటు ఇనుప పాత్రలో నానబెట్టి ఉంచితే ఇంకా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
జిడ్డు జుట్టుపై హెన్నా వాడకూడదు:
చాలా మంది హెన్నాను అప్లై చేసిన తర్వాత ఒకే సారి జుట్టు వాష్ చేసుకోవచ్చని అనుకుంటారు. కానీ జిడ్డు లేదా మురికి జుట్టు మీద హెన్నాను అప్లై చేయడం వల్ల అంతగా ఫలితం ఉండదు. జుట్టు జిడ్డుగా లేకపోయినా కూడా జుట్టుకు ఉన్న ఆయిల్ రక్షణగా పనిచేస్తుంది. ఇలాంటి సమయంలో జుట్టుకు హెన్నా అప్లై చేస్తే జుట్టుకు అంటుకోందు. అందుకే ముందుగా షాంపూతో తలస్నానం చేసి జుట్టు ఆరిన తర్వాత హెన్నా అప్లై చేయాలి.
షాంపూ వాడకం:
హెన్నా అప్లై చేసిన వెంటనే షాంపూతో తలస్నానం చేయకండి. సాధారణ నీటితో జుట్టును వాష్ చేసుకోండి. కండీషనర్ వాడే అలవాటు ఉన్న వారు కండిషనర్ కూడా వాడవచ్చు. కండిషనర్ వాడటం వల్ల ఎలాంటి నష్టం ఉండదు.
పెట్రోలియం జెల్లీ అప్లై చేయండి:
వెంట్రుకలు, చెవులకు హెన్నా అంటుకోకుండా ఉండేందుకు కొన్ని రకాల టిప్స్ పాటించాలి. ముఖ్యంగా హెన్నా జుట్టుకు అప్లై చేసే ముందు వ్యాజిలెన్ వాడండి.
Also Read: ఈ టిప్స్ పాటిస్తే.. జన్మలో జుట్టు రాలదు
హెన్నా వాడకం:
హెన్నాను అప్లై చేసే ముందు జుట్టును విడదీయడం కూడా చాలా ముఖ్యం. దీని వల్ల జుట్టుకు హెన్నా అప్లై చేయడం సులభం అవుతుంది. అంతే కాకుండా ఎక్కువగా చిక్కు పడదు. ఇలా కొన్ని రకాల టిప్స్ పాటించి జుట్టుకు హెన్నాను జుట్టుకు అప్లై చేయండి. హెన్నాలో ఎగ్ వేసుకుని జుట్టుకు అప్లై చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా కూడా ఉంటుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.