BigTV English

Idli Kadai : ధనుష్ “ఇడ్లీ కడై” నుంచి సాలిడ్ అప్డేట్… రిలీజ్ డేట్ ఫిక్స్

Idli Kadai : ధనుష్ “ఇడ్లీ కడై” నుంచి సాలిడ్ అప్డేట్… రిలీజ్ డేట్ ఫిక్స్

Idli Kadai : కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) మల్టీటాలెంటెడ్ అన్న విషయం తెలిసిందే. ఆయన తెరపై అద్భుతంగా నటించడం మాత్రమే కాదు తెర వెనుక సినిమా షిప్ కి కెప్టెన్ గా కూడా వ్యవహరించగలరు. అలా మెగా ఫోన్ పట్టి పలు బ్లాక్ బస్టర్ సినిమాలను తెరపైకి తీసుకొచ్చిన ధనుష్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న మరొ చిత్రం ‘ఇడ్లీ కడై’ (Idli Kadai) అంటే తెలుగులో ఇడ్లీ కొట్టు. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.


ధనుష్ (Dhanush) ‘ఇడ్లీ కడై’ (Idli Kadai) సినిమాకు దర్శకత్వం వహించడం మాత్రమే కాదు హీరోగా నటిస్తూనే నిర్మిస్తున్నారు కూడా. ఈ మూవీలో నిత్యా మేనన్ క‌థానాయిక‌గా నటిస్తుండగా, డాన్‌ పిక్చర్స్‌, వండ‌ర్ బార్ ఫిల్మ్స్ ప‌తాకాల‌పై ఆకాశ్ భాస్క‌ర‌న్ నిర్మిస్తున్నారు. షాలినీ పాండే, ప్రకాష్ రాజ్ ఇందులో కీల‌క పాత్ర‌ల్లో కన్పించబోతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి సాలీడ్ అప్‌డేట్ వ‌చ్చింది. ఈ చిత్ర విడుద‌ల తేదీని ధనుష్ స్వయంగా వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగ విడుదల చేయనున్నట్టు ధనుష్ తన ఎక్స్ పేజీలో పోస్టర్ ను షేర్ చేశారు.

కాగా ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘పవర్ పాండి’, ‘రాయన్’ వంటి చిత్రాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాల తర్వాత ధనుష్ స్వీయ దర్శకత్వంలో చేస్తున్న మూవీ ‘నిలవుక్ ఎన్ మేల్ ఏనాది గోబం’. ఈ చిత్రాన్ని వచ్చే నెల క్రిస్మస్ రోజున విడుదల చేయనున్నట్టు సమాచారం. దీని తర్వాత ధనుష్ దర్శకత్వంలో వస్తున్న 4వ సినిమా ‘ఇడ్లీ కడై’ (Idli Kadai). ధనుష్‌కి ఇది 52వ సినిమా. ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ‘తిరుచిర్తంబలం’ తర్వాత ధనుష్ సరసన నిత్యా మీనన్ ఈ సినిమాలో మరోసారి నటిస్తోంది.


ఇదిలా ఉండగా ధనుష్ (Dhanush) ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. అప్పుడే తన 55 వ మూవీని కూడా ధనుష్ లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ధనుష్ నెక్స్ట్ మూవీకి డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియాసామి దర్శకత్వంలో చేయబోతున్నాడు అనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. దానికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ ఈరోజే రానుంది. ఇక రాజ్ కుమార్ పెరియాసామి ఈ దీపావళికి ‘అమరన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ‘అమరన్’ దీపావళి స్పెషల్‌గా అక్టోబర్ 31న విడుదలైంది. విమర్శకులు, ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న ‘అమరన్’ ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దీంతో నెక్స్ట్ ఈ దర్శకుడితో ధనుష్ చేయనున్న సినిమాపై ఆసక్తి పెరిగింది.

చివరగా ధనుష్ (Dhanush) ‘రాయన్’ మూవీతో ప్రేక్షకుల పలకరించారు. అన్నా తమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఫలితంగా ధనుష్ ఈ మూవీతో హిట్టు కొట్టి మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు.

Related News

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Big Stories

×