Farmers Protest: పైన కనిపిస్తున్న రైతులంతా పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటే భూములు ఇచ్చారు. ఒకటి.. రెండు కాదు.. రెండు దశాబ్దాలు గడిచింది. కనీసం పరిశ్రమకు సంబందించి ఒక్క ఇటుక కూడా పడలేదు. పరిస్థితి గమనించిన నేరుగా రైతులు రోడ్డుపైకి వచ్చేశారు. ఇంతకీ ఇక్కడ అన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం.
ఉమ్మడి గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. నిధులు రాలేదని కాదండోయ్. మై హోమ్ సిమెంట్స్‌కు వారంతా భూములు ఇచ్చారు. భూములు ఇచ్చి 20 ఏళ్లు గడిచినా, ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు.
దీన్ని గ్రహించిన రైతులు నిరసనకు దిగారు. ఫ్యాక్టరీ నిర్మించే వరకు భూములు సాగు చేసుకుంటామని కోరుతూ దాచేపల్లి తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. రైతు బిడ్డలకు ఉద్యోగ, ఉపాధి లేక వలసలు వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
భూములు ఇచ్చినప్పుడు మా వయస్సు పదేళ్లు అని, ఇప్పటికీ మై హోమ్ మేనేజ్‌మెంట్ స్పందిచలేదన్నది రైతుల ఆవేదన. మరో నాలుగు నెలలు గడువు ఇస్తున్నామని, ఈలోగా ఏదో ఒక నిర్ణయం చెప్పాలని అంటున్నారు. లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నది వారి మాట. ఆ విషయం తెలియాలనే నిరసన చేపట్టినట్టు తెలిపారు.
ALSO READ: కొత్త రికార్డు దిశగా టీడీపీ, అమల్లోకి వచ్చేసింది, ఆపై సంతకాలు
పంట పొలాలు ఇచ్చిన రైతులకు ఎలాంటి న్యాయం చేయలేదని అంటున్నారు. మోసపూరిత వాగ్దానాలు చేసి రైతుల వద్ద తక్కువ ధరకే భూములను తీసుకున్నారని మండిపడ్డారు. మై హోం సిమెంట్ మేనేజ్‌మెంట్ ఇప్పటివరకు తమకు ఎలాంటి న్యాయం చేయలేదని వాపోతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. తమకు న్యాయం జరుగుతుందనే పూర్తి నమ్మకం ఉందంటున్నారు.
రైతులు రోడ్డెక్కడానికి కారణాలు చాలానే ఉన్నాయి. కొద్దిరోజుల కిందట డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పల్నాడులో పర్యటించారు. సరస్వతి పవర్ ఆధీనంలో భూములపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా అటవీ, అసైన్మెంట్ భూములున్నట్లు కబ్జాకు గురైనట్టు గుర్తించారు. రైతుల నుంచి భూములు సేకరించిన కంపెనీ ప్రతినిధులు, ఏళ్ల తరబడి కట్టకుండా ఉండడంపై మండిపడిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో మై హోం సిమెంట్ వ్యవహారంపై రైతులు కదం తొక్కారని అంటున్నారు.
మై హోమ్ సిమెంట్స్ కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన..
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలో మై హోమ్ సిమెంట్స్ కు భూములు ఇచ్చిన రైతులు
భూములు ఇచ్చి 20 ఏళ్లు అయినా ఇంతవరకూ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదంటున్న రైతులు
రైతు బిడ్డలకు ఉద్యోగ, ఉపాధి లేక వలసలు వెళ్తున్నామని ఆవేదన… pic.twitter.com/6lru7W7VLY
— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2025