Big Stories

Heavy Rains in Brazil: భారీ వర్షాలు.. 39 మంది మృతి, డజన్ల సంఖ్యలో గల్లంతు..!

Heavy Rains in Brazil, 39 killed: ఒక పక్క భారీ వర్షాలు దుబాయ్ ను అతలాకుతలం చేస్తున్నాయి. మరోపక్క భారీ వర్షాలతో బ్రెజిల్ ఉక్కిరిబిక్కిరవుతోంది. రియోగ్రాండే దో సుల్ స్టేట్ లో భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకూ 39 మంది మరణించారు. మరో 80 మంది గల్లంతయ్యారు. బ్రెజిల్ చరిత్రలోనే ఈ వర్షాలు అత్యంత దారుణమైనవిగా పేర్కొంటున్నారు అక్కడి అధికారులు.

- Advertisement -

భారీ వర్షాలు, కొండ చరియలు విరిగి పడటంతో.. మృతుల సంఖ్య పెరుగుతోంది. గవర్నర్ ఎడ్వర్డో లైట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా 10 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఏప్రిల్ 29 నుంచి వర్షాలు ఎడతెరపిలేకుండా కురుస్తున్నట్లు అక్కడి వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

- Advertisement -

Also Read: Pro Palestine Protesters : గాజా నిరసనకారులపై టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే ప్రయోగం.. 25 మంది అరెస్ట్

626 దళాలతో పాటు 12 విమానాలు, 45 వాహనాలు, 12 బోట్లతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలకు ఆహారం, నీరు పంపిణీ చేస్తున్నారు. అలాగే నిర్వాసితులకు షెల్టర్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గుయిబా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో.. అక్కడ వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News