Bigg Boss Kannada : పాపులర్ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss)కు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా కన్నడ బిగ్ బాస్ కు హోస్టుగా వ్యవహరిస్తున్న కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) నెక్స్ట్ సీజన్ కి తను గుడ్ బై చెప్పబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు.
బిగ్ బాస్ కు గుడ్ బై… హీరో ఎమోషనల్ పోస్ట్…
తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో బిగ్ బాస్ షోకు విశేష ప్రేక్షకరణ లభిస్తోంది. దానికి తగ్గట్టుగానే ప్రతి ఏడాది ఒక్కో సీజన్ లో పలువురు సెలబ్రిటీలు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి అలరిస్తున్నారు. ఇక హోస్టు సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. షో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి, ప్రతి వీకెండ్ హోస్ట్ కంటెస్టెంట్స్ ను చెడామడా వాయించే ఎపిసోడ్ కోసమే చాలామంది ఈ షోను చూస్తారు. టాలీవుడ్ లో గత కొన్ని సీజన్ల నుంచి నాగార్జున హోస్ట్ గా కంటిన్యూ అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే గత సీజన్ వరకు తమిళంలో కూడా కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించారు. ఇక కన్నడలో సీజన్ మొదటి నుంచి ఇప్పటిదాకా కన్నడ స్టార్ సుదీప్ హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం కన్నడలో బిగ్ బాస్ సీజన్ 11 (Bigg Boss Kannada 11) నడుస్తుండగా, షో కి గుడ్ బై చెప్పబోతున్నాను అంటూ తాజాగా సుదీప్ (Kiccha Sudeep) ఎమోషనల్ పోస్ట్ చేశారు. “గత 11 సీజన్ల నుంచి ఎంజాయ్ చేస్తూ చేసిన షో బిగ్ బాస్. ఈ షో కి హోస్ట్ గా నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. త్వరలోనే జరగనున్న బిగ్ బాస్ ఫినాలేతో ఈ నా ప్రయాణం పూర్తి కాబోతోంది. హోస్ట్ గా నా శక్తి మేరకు అందరిని ఎంటర్టైన్ చేశానని నేను అనుకుంటున్నాను. ఈ బిగ్ బాస్ ప్రయాణం మరపురానిది. నాకు సాధ్యమైనంత వరకు దీనిని బెస్ట్ గా హోస్ట్ చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కన్నడ కలర్స్ టీవీ వారికి థాంక్స్. ప్రేమతో మీ కే” అంటూ సుదీప్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
11 సీజన్లకు ఒక్కరే హోస్ట్…
హాలీవుడ్ షో బిగ్ బ్రదర్ నుంచి పుట్టుకొచ్చింది ఈ బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్. దీనికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కన్నడలో 2013లో ఈ షో స్టార్ట్ అయ్యింది. అయితే షో మొదటి పెట్టినప్పటి నుంచి 11 సీజన్ల వరకు కిచ్చా సుదీప్ హోస్టుగా సక్సెస్ ఫుల్ గా నడిపించారు. కానీ తాజాగా ఆయన ఈ షోకు దూరమవుతున్నట్టు ప్రకటించి అభిమానులకు బాడ్ న్యూస్ చెప్పారు. ఇక ప్రస్తుతం బిగ్బాస్ కన్నడ సీజన్ 11 నడుస్తుండగా, తెలుగు, తమిళంలో ఇప్పటికే 8వ సీజన్ పూర్తయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా బిగ్ బాస్ 18 హిందీ కూడా పూర్తయింది. హిందీలో చాలా సీజన్ల నుంచి సల్మాన్ ఖాన్ హూస్ట్ గా చేస్తూ వస్తున్నారు.
BB is smthn I have enjoyed from past 11 seasons. Thank u all for all the love you have shown. Coming finale is my last as a host, and I hope to entertain u all to my best.
It's an unforgettable journey, I'm glad to have handled it to my best.
Thank you, @ColorsKannada, for this…— Kichcha Sudeepa (@KicchaSudeep) January 19, 2025