Kovur Politics: నెల్లూరు జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి.వైసీపీ నేత, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంటి ఆవరణలోవున్న కారుని ధ్వంసం చేయడంతో పాటు ఫర్నీచర్, కుర్చీలను విరగొట్టారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
నెల్లూరులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నెల్లూరు కొండయ్యపాలెం గేట్ అంబేద్కర్ భవన్ సమీపంలో నివాసం ఉంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంటి బయట ఉన్న కారు ధ్వంసం చేశారు. ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను నాశనం చేశారు. ఇక ఫర్మిచర్ గురించి చెప్పనక్కర్లేదు.
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు. ఘటన జరగడానికి కొద్దిగంటల ముందు కోవూరులో ఓ సమావేశంలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. ఆ సమావేశం తర్వాత ఇంటికి వచ్చారు. కొద్దిసేపటికే ఈ సంఘటన చోటు చేసుకుంది.
దాడి జరిగిన సమయంలో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో లేరు. కోవూరులో వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆ జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. ఈ క్రమంలో వేమిరెడ్డి అనుచరులు నల్లపురెడ్డి ఇంట్లోకి చొరబడ్డారని అంటున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడిదే ఆ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
ALSO READ: శ్రీవారి భక్తులకు మరో కబురు.. టీటీడీ కీలక నిర్ణయం
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు పోలీసులు. నెల్లూరులో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి చూడలేదని అంటున్నారు అక్కడి ప్రజలు. ఉన్నట్లుండి ఈ రెండు కుటుంబాల మధ్య ఏం జరిగిందంటూ చర్చించుకోవడం మొదలైపోయింది. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి దగ్గర బంధువు వేమిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి. ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి.
జరిగిన ఘటనపై అధినేత జగన్ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు. ఇంట్లో ఉంటే తనను చంపేసివారని కామెంట్స్ చేశారు. ఇంట్లో ఉన్న తన తల్లిని బెదిరించారని అన్నారు. వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయాలకు పాల్పడతారని తాను అనుకోవడం లేదన్నారు.
నెల్లూరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడి
ప్రసన్న నివాసానికి వచ్చిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు
ఇంట్లో ఫర్నిచర్, కారు ధ్వంసం
ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్, బట్టలను తగలబెట్టిన దుండగులు
దాడికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్న పోలీసులు
దుండగుల… pic.twitter.com/MqSUb0QjHh
— BIG TV Breaking News (@bigtvtelugu) July 8, 2025