BigTV English

Tirumala Tickets 2024: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నేడు ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల..

Tirumala Tickets 2024: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నేడు ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల..

Tirumala Tickets 2024: మీరు ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారిని దర్శించాలని అనుకుంటున్నారా.. దర్శనం టికెట్లను స్వీకరించాలా అయితే మీలాంటి భక్తుల కోసం టీటీడీ నేడు ఆన్లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్లను విడుదల చేయనుంది.


టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు భాద్యతలు స్వీకరించిన సమయం నుండి పాలనా అంశాలపై పట్టు సాధిస్తున్నారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు స్వామి వారిని తక్కువ సమయంలోనే దర్శించేలా ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసేందుకు సైతం చైర్మన్, అధికారులతో చర్చలు జరుపుతున్నారు. తిరుమల పవిత్రతను కాపాడడంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా, ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాక, దేశ విదేశాల నుండి సైతం భక్తులు తరలివస్తారు. పలువురు భక్తులు ఆన్లైన్ విధానం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లను స్వీకరిస్తారు. అటువంటి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ ద్వారా టికెట్లను అందించే కార్యక్రమాన్ని ప్రతినెలా నిర్వహిస్తుంది.


తాజాగా నేడు ఆన్లైన్ ద్వారా శ్రీవారి దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెల కు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. అలాగే ఈనెల 20వ తేదీన లక్కీ డిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపును సైతం నిర్వహించనున్నారు. నేటి ఉదయం పది గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆర్జిత సేవ టికెట్లకై రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. మరెందుకు ఆలస్యం శ్రీవారి దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా స్వీకరించండి.

తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప‌రేడ్ మైదానంలో నవంబరు 18వ తేదీ రాత్రి నిర్వహించనున్న కార్తీక మ‌హాదీపోత్సవానికి టిటిడి చేపట్టిన విస్తృత ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. హెచ్ డీపీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక మహా దీపోత్సవానికి భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని టిటిడి కోరుతోంది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందించనున్నారు.

ఇందులో భాగంగా మ‌హిళ‌లు కూర్చుని దీపాలు వెలిగించేలా దీప‌పు దిమ్మెలు, నేతి వ‌త్తులు ఏర్పాటు చేస్తున్నారు. మైదానం మొత్తం తివాచీలు, ఒక్కో దీపపు దిమ్మె వ‌ద్ద తుల‌సి మొక్కను ఉంచనున్నారు. కార్యక్రమం అనంత‌రం మ‌హిళ‌లకు ఈ మొక్కల‌ను అందిస్తారు. వేదిక‌ను శోభాయ‌మానంగా పుష్పాల‌తో, విద్యుత్ దీపాలు, వేదిక ఇరువైపులా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సెట్టింగ్ లు ఏర్పాటు చేస్తున్నారు.

Also Read: మధిరలో ప్రత్యక్షమైన లేడీ అఘోరీ.. అక్కడ ఎవరిని కలిశారో తెలిస్తే.. షాక్ కావాల్సిందే!

కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న శ్రీ మ‌హాల‌క్ష్మీపూజ‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప్రధాన ద్వారాల నుంచి ఆవ‌ర‌ణం మొత్తం అర‌టి చెట్లు, పూలు, విద్యుద్దీపాల‌తో అలంకరించనున్నారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మైదానంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×