E-Paper
Advertisement

ఫార్చ్యూన్ ఇండియా కవర్ పేజీపై లోకేశ్ ఫొటో.. రూ.కోటి ఖర్చు చేశారా? ఫ్యాక్ట్ చెక్‌లో తేలిందిదే!

ఫార్చ్యూన్ ఇండియా కవర్ పేజీపై లోకేశ్ ఫొటో.. రూ.కోటి ఖర్చు చేశారా? ఫ్యాక్ట్ చెక్‌లో తేలిందిదే!
Advertisement

Fact Check: ఆంధ్రప్రదేశ్ రైజింగ్ స్టార్ గా నారా లోకేశ్ ను అభివర్ణిస్తూ.. ప్రముఖ జాతీయ పత్రిక ‘ఫార్చ్యూన్ ఇండియా’ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఆగస్టు నెలకు సంబంధించిన సంచిక బ్యానర్ లో లోకేశ్ ఫొటోను ముద్రించారు. అయితే పత్రికలో ఇలా రాయించుకోవడానికి ప్రభుత్వ ధనం రూ.కోటి ఇచ్చారంటూ నెట్టంట ప్రచారం మెుదలైంది. ఇదిగో సాక్ష్యం అంటూ ఓ జీవోను సైతం నెట్టింట వైరల్ చేస్తున్నారు. దీనిపై ఫ్యాక్ట్ చెక్ టీమ్ తాజాగా స్పందించింది. అదంతా ఫేక్ ప్రచారమని కొట్టిపారేసింది.

ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఏం చెప్పిందంటే?

ఫార్య్చూన్ పత్రికలో నారా లోకేశ్ వ్యాసం కోసం రూ.కోటికి పైగా ఖర్చు చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఏపీ ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ పోస్ట్ రాసుకొచ్చింది. ‘ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేశారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యం. ఈ తప్పుడు ప్రచారం లో చూపించిన జీవో 2025 జనవరి 18వ తేదీకి సంబంధించింది. అది ఏపీలో పెట్టుబడి అవకాశాలను ప్రచారం చేసేందుకు ఇంగ్లీష్ ఛానెల్ CNBC TVకు చెల్లింపు చేయాలని ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాలు’ అని ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది.

Advertisement

వదంతులపై స్ట్రాంగ్ వార్నింగ్

దురుద్దేశపూర్వకంగా ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం నేరమని ఫ్యాక్ట్ చెక్ టీమ్ హెచ్చరించింది. రూ.కోటి 15 లక్షల 64 వేలు ప్రభుత్వం ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపైనా, తప్పుడు పోస్టును సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్న వారిపైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని.. అసత్య ప్రచారాలను నమ్మవద్దని తెలియజేసింది.

Advertisement

Also Read: ఇంటి అద్దె కంటే.. EMI ఎక్కువైనా సొంత ఇల్లు కొనొచ్చా? సూటిగా సుత్తి లేకుండా!

పార్ఛ్యూన్ కథనంలో ఏముందంటే?

ఇదిలా ఉంటే ఫార్చ్యూన్ ఇండియా పత్రిక.. ఐటీ శాఖ మంత్రి లోకేశ్ పై ప్రశంసల వర్షం కురిపించింది. గూగుల్ డేటా సెంటర్, ఐబీఎం, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఏపీకి రావడంలో ఆయన ముఖ్యభూమిక పోషించారని కొనియాడింది. అంతర్జాతీయ సంస్థల రాక కోసం లోకేశ్ తీసుకుంటున్న నిర్ణయాలు.. ఏపీలో నూతన శాకానికి నాంది పలుకుతోందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 22 ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తూ పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని లోకేశ్ కల్పిస్తున్నారని కొనియాడింది. అటు విద్యాశాఖలోనూ తనదైన ముద్ర వేస్తూ రైజింగ్ స్టార్ లా లోకేశ్ ముందుకు సాగుతున్నారని చెప్పుకొచ్చింది.

Also Read: వర్షాల వేళ గదిలో గిన్నెడు ఉప్పు.. ఆ తర్వాత కలిగే బెనిఫిట్స్ చూసి.. పక్కా ఆశ్చర్యపోతారు!

Tags

Related News

పవిత్రమైన గోవింద నామాలపై పేరడీలా?.. పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం!

వైసీపీ నిరసనలపై గాలి తీసేసిన సీఎం చంద్రబాబు.. గొడ్డలి పట్టుకుని రోడ్లపై రప్పా రప్పా తిరగడానికా?

మా బాధను రాజకీయం చేయొద్దు.. దండం పెడతా! మెడికో ప్రియాంక తండ్రి

ఏపీ వ్యాప్తంగా వైసీపీ ర్యాలీలు.. ముందస్తుగా కీలక నేతలు అరెస్ట్, జెన్ జీల జాడేది?

ప్రేమ పెళ్లి పేరుతో యువతి బేరం.. అమ్మాయి పేరెంట్స్ నుంచి డబ్బులు డిమాండ్, ఏలూరు జిల్లాలో ఘటన

ముఖం చాటేస్తున్న పులస చేప.. ఎందుకిలా, అదేనా అసలు కారణం, మార్కెట్లో దొరికినా..

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు టెక్కీ మృతి, షాక్‌లో కుటుంబసభ్యులు

Big Stories

Advertisement
×