E-Paper
Advertisement

ధర ఎక్కువైనా వర్త్ అనిపించే ఫీచర్లు.. OnePlus 16లో రాబోతున్న క్రేజీ చేంజెస్ ఇవే!

ధర ఎక్కువైనా వర్త్ అనిపించే ఫీచర్లు.. OnePlus 16లో రాబోతున్న క్రేజీ చేంజెస్ ఇవే!
Advertisement

OnePlus 16: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వస్తుందంటే.. వినియోగదారుల్లో జోష్ మొదలైపోతుంది. అలాంటి వారి కోసమే త్వరలో ‘వన్‌ప్లస్ 16’ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. గతంలో వచ్చిన వన్‌ప్లస్ 15కి సక్సెసర్‌గా రానున్న ఈ హ్యాండ్ సెట్ గురించి కంపెనీ అధికారికంగా వివరాలు వెల్లడించక పోయినప్పటికీ.. చైనాలోని రేడియో సర్టిఫికేషన్ ద్వారా కొన్ని కీలక వివరాలు బయటకు వచ్చాయి.

తాజాగా లీకైన సమాచారం ప్రకారం.. ఈ OnePlus 16లో 5G కనెక్టివిటీకి సంబంధించి N79 బ్యాండ్‌తో పాటు GSM, WCDMA, LTE వంటి పలు రకాల ఫ్రీక్వెన్సీ బ్యాండ్లకు సపోర్ట్ లభించనుంది. దీంతో ఇంటర్నెట్ స్పీడ్, కాల్ క్వాలిటీ చాలా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించారు. ఈ ఏడాది ద్వితీయార్థంలోనే ఈ ఫోన్ చైనాలో ముందుగా విడుదల కానుంది.

Advertisement

Also Read: కెమెరా ఉన్న ఎయిర్‌పాడ్స్.. డిజైన్ మారిన వాచ్ అల్ట్రా.. యాపిల్ 2026 ఈవెంట్‌పైనే అందరి కళ్లు!

OnePlus 16లో క్వాల్కమ్ ఇంకా అధికారికంగా ప్రకటించని ‘స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో’ చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. 2 నానోమీటర్ ప్రాసెస్‌పై తయారయ్యే ఈ చిప్‌సెట్ గేమింగ్‌కి, హెవీ ప్రాసెసింగ్‌కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా.. గేమర్స్ కోసం ప్రత్యేకంగా విండ్ ఛేజర్ గేమింగ్ కోర్, హై రిఫ్రెష్ రేట్, ఈ-స్పోర్ట్స్ ట్రిపుల్ చిప్ వంటి అత్యాధునిక గేమింగ్ టెక్నాలజీలను ఈ ఫోన్‌లో పరిచయం చేయబోతున్నట్లు కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసింది.

Advertisement

OnePlus 11 తర్వాత కంపెనీ బడ్జెట్ వేరియంట్‌ను నిలిపివేసింది. అయితే ఈసారి OnePlus 16లో మళ్లీ 8GB ర్యామ్ మోడల్‌ను తిరిగి తీసుకువస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రారంభ వేరియంట్ అయిన 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ మోడల్ ధర చైనాలో సుమారు రూ.71,000 ఉండే అవకాశం ఉంది. గతంలో వచ్చిన OnePlus 15 ప్రారంభ ధర కంటే ఇది కాస్త ఎక్కువగానే ఉండేలా కనిపిస్తోంది.

Also Read: షాకింగ్.. భారత్‌లో మళ్లీ పెరిగిన Vivo X300 FE ధర.. ఏకంగా రూ.10,000 పెంపు!

Tags

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×