E-Paper
Advertisement

వర్షాల వేళ గదిలో గిన్నెడు ఉప్పు.. ఆ తర్వాత కలిగే బెనిఫిట్స్ చూసి.. పక్కా ఆశ్చర్యపోతారు!

వర్షాల వేళ గదిలో గిన్నెడు ఉప్పు.. ఆ తర్వాత కలిగే బెనిఫిట్స్ చూసి.. పక్కా ఆశ్చర్యపోతారు!
Advertisement

Salt for Dampness: వర్షం, చలికాలంలో చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో తేమ (Dampness) ఒకటి. గోడలు తడిబారడం, దుస్తుల నుంచి మురికి వాసన రావడం, బ్యాక్టీరియాలతో నిండిన గాలి చిరాకు కలిగిస్తాయి. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి మార్కెట్లో లభించే ఖరీదైన డీహ్యూమిడిఫైయర్లు (Dehumidifiers) వాడాల్సిన అవసరం లేదు. వంటింట్లో ఉండే ఉప్పుతోనే ఈ తేమకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఈ కథనంలో చూద్దాం.

ఉప్పు ఎలా పనిచేస్తుంది?

ఉప్పుకి గాలిలోని తేమను పీల్చుకునే సహజ గుణం (Hygroscopic nature) ఉంటుంది. గాలిలోని నీటి బిందువులను ఇది వేగంగా ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో గదిలో ఉప్పు ఉన్న గిన్నెను ఉంచినప్పుడు అది గాలిలో అదనంగా ఉన్న తేమను పీల్చుకుని గది వాతావరణాన్ని పొడిగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఇది విద్యుత్ తో పని లేని, శబ్దం అవసరం లేని సహజమైన చిట్కా అని నిపుణులు పేర్కొంటున్నారు.

చిట్కాను ఇలా అమలు చేయండి!

Advertisement

ఈ చిట్కా పాటించడం చాలా ఈజీ. ఒక వెడల్పాటి గాజు లేదా ప్లాస్టిక్ గిన్నెను తీసుకోండి. అందులో సగం కంటే ఎక్కువగా దొడ్డు ఉప్పు (Rock Salt)ను నింపండి. గదిలో తేమ ఎక్కువగా ఉండే మూలల్లో, గాలి తక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ గిన్నెను ఉంచండి. గిన్నె ఎంత వెడల్పుగా ఉంటే ఉప్పు అంత ఎక్కువ విస్తీర్ణాన్ని కలిగి ఉండి.. తేమను వేగంగా పీల్చుకునే వీలుంటుంది.

ఉప్పు ఎప్పుడు మార్చాలి?

కొన్ని రోజుల తర్వాత గిన్నెలోని ఉప్పు గాలిలోని తేమను పీల్చుకుని.. తడిగా మారడం చూడొచ్చు. ఉప్పు పూర్తిగా కరిగిపోతున్నట్లు అనిపిస్తే.. ఆ నీటిని పారబోసి, గిన్నెను తుడిచి మళ్లీ కొత్త ఉప్పును నింపాలి. గదిలోని తేమ శాతాన్ని బట్టి ప్రతి వారానికి లేదా రెండు వారాలకొకసారి ఉప్పును మార్చడం మంచిది.

Advertisement

Also Read: టెలికాం గేమ్‌ ఛేంజర్స్.. అసలు Local, STD, PCO అంటే ఏంటి? 1990’s జ్ఞాపకాలు!

మరికొన్ని బెనిఫిట్స్..

ఉప్పు కేవలం తేమను తగ్గించడమే కాకుండా గదిలో వచ్చే దుర్వాశనలను కూడా దూరం చేస్తుంది. మీకు మంచి సువాసన కావాలనుకుంటే.. ఉప్పు గిన్నెలో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలపవచ్చు. దీనివల్ల గదిలోని తేమ తగ్గడంతో పాటు ఆహ్లాదకరమైన సువాసన వస్తుంది. మెుత్తంగా చూస్తే.. తక్కువ ఖర్చుతో, ఎటువంటి రసాయనాలు లేకుండా ఇంటిని పొడిగా ఉంచుకోవడానికి ఈ చిన్న చిట్కా ఎంతో ఉపయోగపడనుంది.

Also Read: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. రేట్లు ఇలా తగ్గించేశారేంటీ!

Tags

Related News

‘మమ్మీ స్విగ్గీలో పిజ్జా ఆర్డర్ చేయవా..’ 10 మినిట్ ఫుడ్ డెలివరీతో పిల్లల్లో చెడు అలవాట్లు

తరచూ పనీర్ తింటున్నారా? అయితే ‘అనలాగ్ పనీర్’ గురించి తప్పక తెలుసుకోండి!

క్యాన్సర్ రీలాప్స్ అంటే ఏమిటి? చికిత్స తర్వాత మళ్లీ క్యాన్సర్ రావడానికి అసలు కారణాలివే!

పీరియడ్స్ సమయంలో తలనొప్పి, వాంతులు, వెలుతురు పడకపోవడం? కారణం ఇదే..

బరువు తగ్గాలంటే పస్తులు ఉండాలా? Eating Less వెనుక ఉన్న పెద్ద డేంజర్ ఇదే!

తేనెటీగ లేదా కందిరీగలు గుంపు దాడి చేస్తే ఎలా తప్పించుకోవాలి? ఈ జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి

ఆఫీస్ లేదా కాలేజీలో పీరియడ్స్ మరకలు అంటుకుంటే ఏం చేయాలి? మీ బ్యాగులొ ఈ కిట్ ఉంటే సమస్యకు చెక్

రాత్రి పడుకునే ముందు ఫోన్‌లో ఈ ఒక్కటి ఆన్ చేయండి.. పొద్దున్నే చాలా ఫ్రెష్‌గా లేస్తారు!

Big Stories

Advertisement
×