Rape case Hyderabad : హైదరాబాద్ లోని చందానగర్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్నేహితుడిని మద్యం మత్తులో ముంచి అతని భార్యపై ఇద్దరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. నమ్మించి మోసం చేసిన స్నేహితుల దురాగతాన్ని గుర్తించిన బాధితురాలి భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కలిసిమెలిసి తిరిగిన స్నేహితులే.. కామాంధులై భార్యను చరిచారు. అప్పటి వరకు అభిమానంగా సాగిన స్నేహం, ఒక్కసారిగా క్రూరంగా మారిపోంది. నమ్మించి మందు మత్తులో ముంచిన దుర్మార్గులు.. అతని భార్యను బలవంతంగా రేప్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చందానగర్ పరిధిలోని ఓ కాలనీలో కుటుంబంతో కలిసి ఉంటున్న ఓ వ్యక్తి.. వంట పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి కొన్ని నెలల క్రితమే వివాహం జరగగా.. చందానగర్ లోని కాపురం పెట్టారు. బాధితురాలి భర్తకు ఇద్దరు స్నేహితులు.. జోగేంద్ర కుమార్, ముఖేష్ తరచూ ఇంటికి వస్తుండే వాళ్లు. వారిని అభిమానంగా పలకరించే ఆ అమ్మాయిపై.. కన్నుపడ్డ ఇద్దరు దుర్మార్గులు చెడు ఆలోచనలను పెంచుకున్నారు.
ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించిన జోగేంద్ర, ముఖేష్.. పథకం ప్రకారం బాధితురాలి భర్తను వారి గదికి పిలిపించుకున్నారు. అక్కడే ఫూటుగా మద్యం తాగించారు. అతను పూర్తిగా సృహ కోల్పోయే వరకు మద్యం తాగించిన నిందితులు.. అతన్ని తీసుకుని ఇంటికి వెళ్లారు. భర్తను అప్పగించేందుకు వచ్చామని చెప్పిన దుర్మార్గులు.. అతన్ని అక్కడ దింపేసిన తర్వాత వారి పాడు బుద్ధిని బయటపెట్టుకున్నారు.
ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారు. తొలుత.. బాధితురాలిపై జోగేంద్ర కుమార్ అత్యాచారానికి పాల్పడాడు. ఆ సమయంలో ఇంకొక నిందితుడైన ముఖేష్ అక్కడ వీడియోలు చిత్రీకరించాడు. అనంతరం అతను కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత సృహలోకి వచ్చిన బాధితురాలి భర్త.. జరిగిన విషయం తెలుసుకుని నిశ్చేష్టుడైయ్యాడు. వెంటనే భార్యను వెంటపెట్టుకుని పోలీసు స్టేషన్ కు చేరుకున్నాడు. నిందుతుల వివరాలతో పాటు వాళ్లు పాల్పడిన దుర్మార్గంపై పోలీసులకు కంఫైంట్ ఇచ్చాడు. దాంతో.. విచారణ చేపట్టిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read : అమానుష ఘటన.. కొడుకును చిత్రహింసలు పెట్టిన తండ్రి