Alastair Cook: టీమిండియా భయంకరమైన ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ అలిస్టర్ కుక్ ( Alastair Cook ). నా జీవితంలో కొట్టినన్ని సిక్సులు…2 గంటల్లో అభిషేక్ శర్మ కొట్టేశాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి ఆటగాడిని నేను ఎప్పుడూ చూడలేదని అభిషేక్ శర్మను తెగ పొగిడేశారు అలిస్టర్ కుక్ ( Alastair Cook ). దీంతో అలిస్టర్ కుక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా… నిన్న ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా భయంకరమైన ఓపెనర్ అభిషేక్ శర్మ ఇరగ దీసిన సంగతి తెలిసిందే.
Also Read: Abhishek Sharma: 37 బంతుల్లో అభిషేక్ శర్మ సెంచరీ… రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ !
నిన్న ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో సెంచరీ పూర్తి చేసుకున్న ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) పలు రికార్డులను బద్దలు కొట్టాడు. నిన్నటి మ్యాచ్ లో 135 పరుగులు చేసి ఔట్ అయ్యాడు శర్మ. దీంతో గిల్ రికార్డును బద్దలు కొట్టాడు. 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 126* పరుగులు చేశాడు. టీ20ల్లో భారత్‌కు ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరు. కానీ ఇప్పుడు 135 పరుగులు చేసి తొలి బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ). అటు 2013లో ఇంగ్లాండ్ పై 156 పరుగులు చేశాడు ఆరోన్ ఫించ్. ఆ తర్వాత అభిషేక్ చేసిన 135 పరుగులే ఇంగ్లండ్‌పై రెండో అత్యధిక స్కోరు.
ఒక్క ఇన్నింగ్స్ లో అభిషేక్ కొట్టిన సిక్స్‌లు 13. ఇలా ఒకే ఇన్నింగ్స్ లో 13 సిక్సులు కొట్టడంతో ఇదే తొలిసారి. 2017లో శ్రీలంకపై రోహిత్ 10 సిక్సులు కొట్టాడు. 2024లో దక్షిణాఫ్రికాపై సంజూ శాంసన్, తిలక్ వర్మ కొట్టారు. అభిషేక్ తన సెంచరీని పూర్తి చేయడానికి 37 బంతులు తీసుకున్నాడు. 2017లో శ్రీలంకపై రోహిత్ శర్మ 35 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. అంటే… టీమిండియా తరఫున రెండవ వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్ గా టీమిండియా భయంకరమైన ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) రికార్డు సృష్టించాడు.
Also Read: South Africa In T20 World Cup: దరిద్రం అంటే ఇదే… నాలుగు సార్లు ఫైనల్లో ఓడిన సౌత్ ఆఫ్రికా?
2007లో ఇంగ్లండ్‌పై యువరాజ్ సింగ్ 12 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. ఈ తర్వాత, అభిషేక్ తన ఫిఫ్టీని సాధించడానికి 17 బంతులు తీసుకున్నాడు. ఇలా టీమిండియా తరపున రెండవ అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ చేసిన ప్లేయర్ గా ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) చరిత్ర సృష్టించాడు. 2023లో న్యూజిలాండ్‌పై 168 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఇదే టీమిండియా మొదటి భారీ విక్టరీ. అయితే.. నిన్న ఇంగ్లాండ్ పై 150 పరుగుల తేడాతో గెలిచి… టీమిండియా రెండో భారీ విక్టరీ నమోదు చేసుకుంది. అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) ఇలాంటి ఆటతీరును కనబర్చుతున్న నేపథ్యంలో… అలిస్టర్ కుక్ ( Alastair Cook ) స్పందించారు. నా జీవితంలో కొట్టినన్ని సిక్సులు…2 గంటల్లో అభిషేక్ శర్మ కొట్టేశాడు అంటూ తెలిపారు. కాగా ఇప్పటి వరకు వన్డే కెరీర్ లో ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ అలిస్టర్ కుక్ 10 సిక్సులే కొట్టాడు. టీ20 లలో ఒక్క సిక్సు కొట్టలేదు.
Alastair Cook said, "Abhishek Sharma hit more sixes in two hours than I hit in my whole life". pic.twitter.com/SN3jnuvY4W
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 2, 2025