BigTV English

AP Assembly: వచ్చారు.. వెళ్లారు.. కనీసం 11 నిమిషాలు కూడా లేరాయే!

AP Assembly: వచ్చారు.. వెళ్లారు.. కనీసం 11 నిమిషాలు కూడా లేరాయే!

AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల నజీర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత అసెంబ్లీకి హాజరయ్యారు మాజీ సీఎం వైఎస్ జగన్. గవర్నర్ ప్రసంగంపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.


ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైసీపీ సభ్యుల నినాదాలు చేశారు. వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. సభ్యుల నినాదాల మధ్యే  గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గత ప్రభుత్వ పాలనపై 7 శ్వేత పత్రాలు విడుదల చేశామన్నారు ప్రస్తావించారు గవర్నర్ నజీర్. అన్ని అంశాల్లోనూ గత ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీశారు ప్రస్తావించారు.

చివరకు ఆందోళన నడుమ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు బాయ్ కాట్ చేశారు. తొలిరోజు అయితే వైసీపీ సభ్యులు సభకు హాజరయ్యారు. ఈసారి సమావేశాలకు సభ్యులు హాజరుకాకుంటే వేటు పడడం ఖాయమని భావించారు. చివరకు ఆ గండం నుంచి వైసీపీ సభ్యులు గట్టెక్కారని చెప్పవచ్చు. మరి మంగళవారం సభకు హాజరవుతారా? లేదా? అనేది క్వశ్చన్ మార్క్. అయితే, వైసీపీ నేతలు వస్తూనే వాకౌట్ పేరుతో వెళ్లిపోయారు. దీంతో కనీసం 11 నిమిషాలు కూడా అసెంబ్లీలో లేకుండా వెళ్లిపోయారే అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.


గవర్నర్ స్పీచ్‌లో ముఖ్యమైన అంశాలు

వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ 25 ఏళ్ల ఆదాయాన్ని కోల్పోయిందని ప్రస్తావించారు గవర్నర్ అబ్దుల్ నజీర్. ఏపీలో సూర్య ఘర్‌ యోజన కింద సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మా ప్రభుత్వ తీసుకున్న చర్యలతో టూరిజంలో పెట్టుబడులు పెరిగాయని వివరించారు. MSME లకు అండగా ఉన్నామని, ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

ALSO READ: ఎమ్మెల్యేలకు పవన్ కీలక సూచనలు

యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్ట్‌ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. మన బడి-మన భవిష్యత్తు ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.

ముఖ్యంగా P-4 విధానం ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామన్న గవర్నర్, మెరిట్‌ ఆధారంగా తొమ్మిది యూనివర్సిటీలకు వీసీలను నియమించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధన ఎత్తి వేసినట్టు తన ప్రసంగంలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించామని, ఐటీఐలు, పాలిటెక్నిక్‌ ల్లో 200 స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు తెలిపారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలో కరవు అనేది ఉండదన్నారు.

సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని వివరించారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేశామని తెలిపారు. మెగా డీఎస్సీ దస్త్రంపై సంతకం చేశామని, అన్న క్యాంటీన్‌లు తెచ్చి పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నట్లు వివరించారు. కూటమి వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్న గవర్నర్, మా ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగిందన్నారు.

ప్రతి నెలా ఒకటిన ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని గుర్తు చేశారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించినట్టు వివరించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. బీసీ వర్గాలు సమాజానికి వెన్నెముక అని, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అర్హులైన అందరికీ సొంతిల్లు ఉండాలనేది కూటమి సర్కార్ మా ఆకాంక్షగా చెప్పుకొచ్చారు.

 

 

 

Related News

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

AP Cabinet: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్.. ఒకటి కాదు సుమా.. అవేమిటంటే?

Big Stories

×