BigTV English

SLBC Tunnel Inside: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ లోపల భయానక పరిస్థితి.. రెస్క్యూ‌కు ఎదురవుతోన్న సవాళ్లు ఇవే

SLBC Tunnel Inside: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ లోపల భయానక పరిస్థితి.. రెస్క్యూ‌కు ఎదురవుతోన్న సవాళ్లు ఇవే

SLBC Tunnel Inside: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్. మంత్రులతో మాట్లాడారు సీఎం. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగించాలని అధికారులను అప్రమత్తం చేశారు.


SLBC Tunnel Inside
SLBC Tunnel Inside

మరోవైపు సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు రెండో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు విశ్వప్రయత్నాలు చేశాయి. అయినా ఫలితం లేకపోయింది. టీబీఎం మెషిన్ సమీపం వరకు వెళ్లారు. బాధితుల పేర్లు పెట్టి పిలిచినా ఎలాంటి సమాచారం లేదు. టన్నెల్ లోపల అంతా బురదమయంగా మారింది.

SLBC Tunnel Inside
SLBC Tunnel Inside

టీబీఎం యంత్రంపై భాగం కుంగిపోయింది. దీంతో ఇతర పరికరాలు అడ్డంగా మారడంతో ముందుకెళ్లలేని పరిస్థితి అక్కడ తలెత్తింది. ఉమ్మడి కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలంలో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ-ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో శనివారం ఉదయం పైకప్పు కూలింది. ఘటన సమయంలో లోపల 8 మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రాష్ట్రప్రభుత్వంతోపాటు సైన్యం పని చేస్తోంది.


SLBC Tunnel Inside
SLBC Tunnel Inside

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్‌ ఘటన వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. 14వ కిలోమీటరు వద్ద సొరంగంలో చిక్కుకున్నకార్మికులను కాపాడటం రెస్క్యూ బృందాలకు అత్యంత సవాల్‌గా మారింది. పైగా టన్నెల్‌లోకి నీరు వచ్చింది. దీంతో లోపలంతా బురద మారింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లటం సిబ్బంది ఇబ్బందికరంగా మారింది.

SLBC Tunnel Inside
SLBC Tunnel Inside

నెమ్మదిగా కష్టపడి టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ వరకు వెళ్లాయి రెస్య్యూ బృందాలు. అక్కడ ఎక్కువ స్థాయిలో బురద ఉండడం గమనించారు. బోరింగ్ మెషిన్‌కు అవతలి వైపు కార్మికులు ఉన్నారు. బృందాలు మైక్‌తో గట్టిగా కేకలు వేసినా అటువైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నది ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డిప్యూటీ కమాండెంట్‌ మాట.

SLBC Tunnel Inside
SLBC Tunnel Inside

టన్నెల్ లోపల పేరుకుపోయిన బురద నీటిని తొలగించేందుకు సహాయక బృందాలు నిమగ్నమయ్యాయి. ప్రధానంగా లోకోమోటివ్‌ ట్రైన్, కన్వేయర్ బెల్ట్‌లను ఉపయోగించి సొరంగం లోపల 13.5 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించారు. 11 నుంచి 13 కిలో మీటర్లు మధ్య ప్రాంతం నీటితో నిండి ఉందన్నారు. ప్రస్తుతం నీటిని తొలగించే ప్రక్రియలో చేపట్టినట్టు అధికారులు తెలిపారు. అది పూర్తయిన తర్వాత రెస్క్యూ కార్యకలాపాలను ప్రారంభిస్తామని తెలియజేశారు.

ALSO READ: మందుబాబులకు శుభవార్త.. కొత్త బ్రాండ్లతో కిక్కే కిక్కు

టన్నెల్ లోపల నీటిని భారీ మోటార్లు పెట్టి శ్రీశైలం జలాశయంలోకి ఎత్తి పోస్తున్నాయి సహాయక బృందాలు. ఇందుకోసం ఐదు హైకెపాసిటీ పంపులను వినియోగించారు. లోపల విద్యుత్‌ సరఫరా లేని చోట కూలిపోయిన ఇనుప రెయిలింగ్, రాడ్లను తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ఎక్కువ కాంతి వెదజల్లే లైట్లను సొరంగంలోకి తీసుకెళ్లారు.

అడ్డంగా ఉన్న ఇనుప కడ్డీలను తొలగిస్తే ఘటన జరిగిన ప్రాంతానికి సహాయక బృందాలు వెళ్లడానికి వీలవుతుందని చెబుతున్నారు ఇంజినీరింగ్‌ అధికారులు. సొరంగంలో విద్యుత్, సమాచార వ్యవస్థల వైర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదంతా అడవీ ప్రాంతం కావడంతో కనీసం మొబైల్‌ సిగ్నల్స్‌ అందుబాటులోకి రాలేదు. దీంతో సహాయక టీమ్‌లు హై ఫ్రీక్వెన్సీ పరికరాలతో ప్రత్యేకంగా యాంటెనాలు రెడీ చేశారు. సమాచార వ్యవస్థ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ ప్రత్యేకంగా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసింది.

 

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×