Amaravati: స్థానిక సంస్థల ఎన్నికలను ఆపేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేతలు వేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు రాబోయే ఆరు వారాల్లోపు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని తీర్పు వెల్లడించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని కొట్టి వేసింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగరా రేపో మాపో మోగనుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కాకపోతే వైసీపీ వేసిన పిటిషన్ల తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేసింది. గురువారం వైసీపీ వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోపు ప్రారంభించాలని తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం-ఎన్నిక కమిషన్‌కు ఆదేశించింది.
అదే సమయంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేసింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని తేల్చిచెప్పింది. సర్ ప్రక్రియ ముగిశాకే ఎన్నికలు జరపాలన్న వైసీపీ పిటిషన్‌ను కొట్టివేసింది న్యాయస్థానం. వార్డుల పునర్విభనపై దాఖలు చేసిన పిటిషన్‌ను తోసి పుచ్చింది. వివిధ అంశాలపై దాదాపు ఆరు పిటిషన్లు దాఖలు అయ్యాయి.బీసీ రిజర్వేషన్లుకు సంబంధించిన ప్రభుత్వం ఉత్తర్వులు భిన్నంగా ఉన్నాయంటూ రెండు జీవోలను కొట్టి వేసింది. ఈ క్రమంలో సర్ పక్రియ పూర్తి కాకుండా ఎన్నికలు వద్దంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది న్యాయస్థానం. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది.
ALSO READ: జగన్.. అసలు ‘రెడ్డి’ కాదు.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల ప్రక్రియపై ప్రభుత్వానికి-ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. వార్డుల పునర్విభజనపై దాఖలైన పిటిషన్లు తోసిపుచ్చింది. కుల జనగణన తరువాత ఎన్నికలు నిర్వహించాలనే పిటిషన్‌ను కొట్టివేసింది. SIR ప్రక్రియ అక్టోబర్ 10 నాటికి పూర్తి కానుంది. 16న ఓటర్ల తుది జాబితా విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. తుది జాబితా తర్వాత ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖరు లోపు స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.