E-Paper
Advertisement

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రంగంలోకి సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ!

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రంగంలోకి సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ!
Advertisement

Heavy Rain: హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు కమిషనర్లు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం సూచించారు.

ఆదేశాలు జారీ..

ప్రధాన రహదారులు, జంక్షన్లు, కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో వెంటనే సిబ్బంది, యంత్రాలను రంగంలోకి దించాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని, ట్రాఫిక్ నిలిచిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నాలాలు, డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని చెప్పారు.

కంట్రోల్ రూమ్‌లు..

Advertisement

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని, కంట్రోల్ రూమ్‌లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉంటూ పరిస్థితిని పర్యవేక్షించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు.

Also read: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్!

Tags

Related News

ప్రభుత్వ వైద్యం దయనీయం.. చిన్నారుల చావుల్లోనూ నిర్లక్ష్యమా?.. కవిత తీవ్ర ఆగ్రహం!

నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ పాపాల పుట్ట బద్దలు.. ఏసీబీ దాడుల్లో సంచలనాలు!

‘సర్’ ప్రక్రియ హాస్యాస్పదం.. ఈసీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు.. కాంగ్రెస్‌ వైఖరిపై ధ్వజం!

ఇలా ఉన్నారేంట్రా.. ట్రాక్టర్‌ని విప్పేసి ఇంజన్ ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎక్కడో తెలుసా..?

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్!

మీ రాజకీయాల కోసం రైతులతో ఆటలా.. మంత్రి జూపల్లి ఫైర్!

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మాజీ ఎంపీ సంతోష్ రావు ఆస్తులపై విచారణ..?

Big Stories

Advertisement
×