Jagan: కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత జగన్. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దిగజారి పోయిందన్నారు. పోలీసుల వికృత రూపానికి తెనాలి ఘటన నిదర్శనమన్నారు. కేసులు ఉంటే నడిరోడ్డుపై కొడతారా? అంటూ ప్రశ్నించారు. మరి 24 కేసులున్న చంద్రబాబు మాటేంటని నిలదీశారు.
మంగళవారం తెనాలి వెళ్లిన మాజీ సీఎం జగన్, పోలీసుల చేతిలో చిత్రహింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తెనాలి పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉండలేదన్నారు. అందులో ఒకరు హైదరాబాద్‌లో జొమాటోలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నారని అన్నారు.
పాత కేసులో వాయిదా కోసం తెనాలికి రావడంతో అతడి స్నేహితులు వచ్చారన్నారు. మంగళగిరి నుంచి తెనాలి తీసుకొచ్చి వారిని కొట్టారని ఆరోపించారు. పోలీసుల వికృత రూపానికి తెనాలి ఘటన నిదర్శనమన్నారు. కేసులు ఉంటే నడిరోడ్డుపై కొడతారా అంటూ ప్రశ్నించారు. మరి 24 కేసులున్న చంద్రబాబు మాటేంటని నిలదీశారు.
కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చని, ఆ వ్యవహారాన్ని న్యాయస్థానాలు చూస్తాయన్నారు. అలాంటప్పుడు చంద్రబాబుపై 24 కేసులున్నాయని, ఆయనను నడిరోడ్డు మీద కొట్టడం ధర్మమేనా అంటూ ప్రశ్నించారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు వాటిని ఉల్లంఘిస్తారా? ఇలా చేసే నైతికత వారికి ఉందా? నడిరోడ్డుపై వారిని కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని తనదైన శైలిలో ప్రశ్నించారు.
ALSO READ: అమరావతిలో సీఎం చంద్రబాబుతో నటుడు నాగార్జున భేటీ
పోయిన ఆ కుటుంబాల పరువును ఎవరు తీసుకొస్తారని నిలదీశారు. అరెస్ట్ చేసినవారిని సకాలంలో న్యాయస్థానంలో ప్రవేశపెట్టలేదన్నారు. చట్టాన్ని ఉల్లంఘించడం కాదా? జగన్ నిలదీశారు. వారికి గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లు అంటూ నిందలు వేస్తున్నారని విమర్శించారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ మాటల్లో సీఎం చంద్రబాబుపై 24 కేసులు ఉన్నాయని కొత్త అబద్దాన్ని తెరపైకి తెచ్చారు.
జగన్ తెనాలి టూర్‌పై రెండురోజులుగా సోషల్‌మీడియా వేదికగా అధికార టీడీపీ-విపక్ష వైసీపీ మధ్య రచ్చ జరిగింది. రౌడీ షీటర్లను, గంజాయ్ బ్యాచ్ వ్యక్తులను జగన్ పరామర్శిస్తున్నారని అధికార పార్టీ ఆరోపించింది. గతంలో ఆ నిందితులకు సంబంధించిన వీడియోలను బయటపెట్టింది. పాలకపక్షం విమర్శలను ఏమాత్రం పట్టించుకోలేకుండా చివరకు మంగళవారం తెనాలి వెళ్లారు జగన్.
జగన్ తెనాలి టూర్‌కు స్థానిక ఆ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. అయినా జగన్‌కు నిరసనల సెగ తగిలింది. ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత, ప్రజాసంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. మార్కెట్ సెంటర్‌లో మానవ హారంగా ఏర్పడి ఆందోళన చేపట్టాయి. వైసీపీ హయాంలో హత్యకు గురైన నూతక్కి కిరణ్‌ను పరామర్శించలేదని, ఇప్పుడు రౌడీ షీటర్లకు మద్దతుగా నిలవడం దారుణమంటూ నినాదాలు చేశాయి కూడా.
సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
కేసులు ఉంటే నడిరోడ్డుపై కొట్టేస్తారా..?
మరి 24 కేసులు ఉన్న చంద్రబాబును కూడా నడిరోడ్డుపై తన్నడం కరెక్టేనా..?
కేసులు తేల్చాల్సిందే కోర్టులే కానీ పోలీసులు కాదు
పోలీసులకు కొట్టడం, షేమింగ్ చేసే హక్కు లేదు
– జగన్ pic.twitter.com/td9dC52JuJ
— BIG TV Breaking News (@bigtvtelugu) June 3, 2025