AP Politics: విశాఖలో సేనాతో సేనాని సమావేశాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల దుమ్ము తులిపేస్తున్నారట. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజక వర్గాల ఎమ్మెల్యేల పనితీరు చిట్టా దగ్గర పెట్టుకొని ఫేస్ టు ఫేస్ ఎమ్మెల్యేలతో పోస్ట్మార్టం చేస్తున్నారట కూటమీ నాయకులతో సంఖ్యత కార్యకర్తలతో ఉన్న సంబంధాలు ప్రజా ప్రతినిధులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై రిపోర్ట్ చేతిలో పట్టుకొని మరి కడిగి పారిస్తున్నారట అసలు సేనాతో సేనాని జనసేన లెజిస్లేటివ్ కౌన్సిల్ మీటింగ్ లో ఏం జరిగింది? జనసేన ఎమ్మెల్యేలపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన ఎలా ఉంది?
పదేళ్లకు ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన
జనసేన పార్టీ స్థాపించిన 10ఏళ్ల తర్వాత అధికారంలో భాగస్వామి అయింది. అధికారం చేపట్టి ఏడాదిన్నర గడుస్తున్న రాష్ట్రంలోని నియోజక వర్గాల్లో పార్టీ క్యాడర్ అసంతృప్తితో ఉండడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా కార్యకర్తలతో మమేకమై ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి మూడు రోజుల కార్యక్రమాన్ని చేపట్టారు. పవన్ కళ్యాణ్ మొదటి రోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.
భవిష్యత్తు రాజకీయాలపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం
పార్టీ పరిస్థితి ఎలా ఉంది? నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా ఆలోచిస్తున్నారు? ప్రభుత్వంలో జనసేన పార్టీ పాత్ర ఎలా ఉంది? భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది లాంటి వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు రాజకీయాలపై ఎమ్మెల్యేలకు ఎమఎల్సీలకు జనసేన అని దిశా నిర్దేశం చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా పవన్ కళ్యాణ్ ఒక్కో ఎమ్మెల్యేతో ప్రత్యేకించి ఐదు నుండి 10 నిమిషాలు నియోజక వర్గంలో ఉన్న ప్రతి అంశం మీద మాట్లాడడం భారీ చర్చకు దారితీస్తుంది. జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్స్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కో ఎమ్మెల్యే తో మాట్లాడుతున్నారు. నియోజక వర్గంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో కార్యకర్తలను ఎమ్మెల్యే ఏ మాత్రం పట్టించుకుంటున్నారు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారో లాంటి విషయాలను సర్వే చేయించిన రిపోర్ట్ దగ్గర పెట్టుకొని అడుగుతూ ఉంటే ఎమ్మెల్యేలు సైతం సమాధానం చెప్పలేక నీళ్లు నమురుతున్నారట. ప్రతి ఎమ్మెల్యేకి సంబంధించిన నియోజక వర్గ స్థాయి రిపోర్ట్ తో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తినట్లు తెలుస్తోంది. అదేవిధంగా నియోజక వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలంతా వ్యవహరిస్తూ ఉంటే భవిష్యత్తు రాజకీయాల్లో ఖచ్చితంగా ఎదురుదెబ్బ తినాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారట.
అభ్యర్థులను మార్చడానికి వెనకడాబోనని హెచ్చరిక
కూటమి పార్టీలతో మరో 15 సంవత్సరాలు కలిసి ఉంటామని గట్టిగా చెబుతున్న జనసేన అధినేత ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు మార్పు రాకపోతే నియోజక వర్గాల్లో అభ్యర్థుల్ని మార్చడానికి కూడా వెనకాలే ప్రసక్తి లేదని గట్టిగా చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే నియోజక వర్గాల్లో కూటమి నాయకులతో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కలిసి వెళ్ళడం లేదు అనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కార్యకర్తలను కూడా జనసేన ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం ప్రతి పనికి కమిషన్లు తీసుకోవడంతో పాటు నియోజక వర్గాల్లో అవినీతిని పెంచి పోషిస్తున్నారని ఎమ్మెల్యేల వైఖరిపై పవన్ చేయించుకున్న సర్వేల్లో రిపోర్ట్లు వచ్చాయట. సదరు సర్వే రిపోర్టును చూపిస్తూ మాట్లాడడంతో పవన్ కళ్యాణ్ కి సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది.
జనసేన ఎమ్మెల్యేలపై కూటమి నేతల అసంతృప్తి
పార్టీ కోసం పని చేసిన కార్యకర్తల్ని పట్టించుకోకపోతే భవిష్యత్తులో మళ్ళీ పోటీ చేసినప్పుడు ఎలా సహకరిస్తారని ఎమ్మెల్యేలను పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కూటమి పార్టీలకు చెందిన నాయకులు కూడా జనసేన ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిగా ఉండడంతో ఆ విషయాన్ని ఎమ్మెల్యేల ముందు పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగుల్లో పవన్ కళ్యాణ్ చేయించిన సర్వే రిపోర్టుని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చూపిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జనసేన పార్టీ నుండి ప్రాతినిత్యం వహిస్తున్న 21 మంది ఎమ్మెల్యేలో పిఠాపురం నియోజక వర్గంకు ప్రాతినిత్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ అనే నేను పి గన్నవరం నియోజక వర్గం ఎమ్మెల్యే అయిన గిడ్డి సత్యనారాయణ తప్ప మిగిలిన 19 మంది ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని రిపోర్ట్లో తేలినట్టు పవన్ కళ్యాణ్ చెప్పడంతో హాల్ మొత్తం సైలెంట్ అయిపోయిందట.
అవినీతికి పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్న పవన్
జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం అంతర్గతంగా జరగడంతో సమావేశానికి హుందాగా లోపలికి వెళ్ళిన ఎమ్మెల్యేలంతా బయటకు వచ్చేసరికి డీలా పడిపోయి రావడం గమని గమనించిన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తమ నాయకులను అడగడంతో అసలు విషయం బయటకు పొక్కింది. నియోజక వర్గాల్లో పని చేస్తున్న ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల మొహం మీదే తెగేసి చెప్పారంట భవిష్యత్తులో రాజకీయాలు ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా పార్టీ సిద్ధాంతాల ప్రకారం ముందుకు వెళ్ళాలని ఎమ్మెల్యేల పనితీరు మారకపోతే తాను నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సమాచారం. దాంతో పాటు అన్ని నియోజక వర్గాల ఎమ్మెల్యేలను పార్టీని ఇంకా ప్రభావితంగా ముందుకు ఎలా తీసుకెళ్ళాలని అడిగి తెలుసుకుంటున్నారట.
నాగబాబు జోక్యంపై పవన్ దృష్టికి తీసుకొచ్చిన ఎమ్మెల్యేలు
గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రపై వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలు పెత్తనం చలాయించడంతో వైసపి పార్టీ ప్రభావాన్ని కోల్పోయింది. అదేవిధంగా జనసేన పార్టీ నాయకుల విషయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమఎల్సి నాగబాబు తలదూరిస్తే ఉత్తరాంధ్రతో పాటు ఇతర జిల్లాల్లో కూడా పార్టీ ప్రభావాన్ని కోల్పోయే అవకాశం ఉన్నట్లు పవన్ కళ్యాణ్ కి నేతలు చెప్పినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తో నాగబాబు గురించి పరోక్షంగా ఎమ్మెల్యేలు చెప్పడంతో మనస్తాపానికి గురై నాగబాబు సమావేశం మధ్యలోనే వెళ్లిపోవడం పెద్ద చర్చకు దారితీస్తుంది. జనసేన పార్టీలో ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకొని అధికారాన్ని చెలాయించాలని చూస్తే మాత్రం ఎమ్మెల్యేలను కూడా ఉపేక్షించేది లేదని అందరూ సమన్వయంతో వ్యవహరించి ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లు తెలుస్తోంది.
Also Read: వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య..
ఇప్పటి వరకు జనసేన పార్టీలో ఎలాంటి విభేదాలు లేకుండా ఉన్నాయని భావిస్తున్నారు. అయితే సేనాతో సేనాని సమావేశాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమఎల్సి నాగబాబుపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారనే సమాచారం బయటకు రావడం ఎమ్మెల్యేలంతా అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యేలకు చులకలు అంటించడం జనసేన పార్టీలో పెద్ద చర్చకు దారి తీస్తుందట. ఈ మూడు రోజుల సమావేశాల తర్వాత అయిన 21 నియోజక వర్గాల్లో పవన్ దిశా నిర్దేశం ఇచ్చిన వార్నింగ్లతో వాళ్ళలో కొంచెమైన మార్పు వస్తుందో లేదో అనేది చూడాలి.
Story By Ajay Kumar, Bigtv