Nitish – Digvesh : ఐపీఎల్ లో ఫేమస్ అయిన దిగ్వేష్ కి నితీశ్ రాణా చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ కెప్టెన్ నితీశ్ రాణా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సౌత్ ఢిల్లీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కేవలం 42 బంతుల్లోనే సెంచరీ బాదాడు. మొత్తం 55 బంతుల్లో 15 సిక్సర్లతో పాటు 8 ఫోర్లు బాది 135 పరుగులు చేశాడు. నితీశ్ ఊచకోతతో వెస్ట్ ఢిల్లీ జట్టు 202 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో క్వాలిఫయర్ 2 కి దూసుకెళ్లింది. ఇవాళ క్వాలిఫయర్ 2లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ తో తలపడనుంది. ముఖ్యంగా దిగ్వేష్ బౌలింగ్ లో నితీష్ రాణా సిక్స్ బాదాడు. అనంతరం బౌలింగ్ చేసే సమయంలో వికెట్ల వద్ద నుంచి పక్కకు తప్పుకున్నాడు. దీంతో దిగ్వేష్ కి నరకం చూపించాడు వెస్ట్ ఢిల్లీ లయన్స్ కెప్టెన్ నితీశ్ రాణా. ఐపీఎల్ లో సంతకం చేసినట్టు ఇప్పుడు కూడా సంతకం చేయమని కొందరూ నెటిజన్లు దిగ్వేష్ పై ట్రోలింగ్స్ చేయడం గమనార్హం.
నితీశ్-దిగ్వేష్ మధ్య గొడవ..
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో నిన్న రాత్రి అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో నితీశ్ రాణా, దిగ్వేశ్ రతికి తీవ్రంగా గొడవ పడ్డారు. నితీశ్ రాణా బ్యాటింగ్ చేస్తుండగా.. దిగ్వేష్ బాల్ వేయబోయి ఆగిపోయాడు. అందుకు కౌంటర్ గా తరువాత బంతిని నితీశ్ మధ్యలో ఆపేశాడు. ఆ తరువాత బంతిని బౌండరీ బాది బ్యాట్ కి కిస్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఒకరి పైకి ఒకరు దూసుకెళ్లారు. ఇక అంపైర్లు, మిగతా ఆటగాళ్లు కలుగ జేసుకోవడంతో కాస్త శాంతించారు. ఎలిమినేటర్ లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ పై 7 వికెట్ల తేడాతో వెస్ట్ ఢిల్లీ ఘన విజయం సాధించింది.
నితీశ్ విధ్వంసం..
తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ 201 పరుగులు చేసింది. అనంతరం 202 పరుగుల లక్ష్య చేధనలో వెస్ట్ ఢిల్లీ 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో వెస్ట్ ఢిల్లీ కెప్టెన్ నితీశ్ రాణా విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్ల పై ఎదురుదాడికి దిగాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో రాణా కేవలం 42 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్ లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ కి చెందిన సుమిత్ మాథుర్ క్రిష్ వైపు దూసుకుపోతూ వేలు చూపిస్తూ ఏదో అన్నాడు. ఇక పరిస్థితి తీవ్రంగా మారడంతో వెస్ట్ ఢిల్లీ లయన్స్ కెప్టెన్ నితీశ్ రాణా ఆన్ ఫీల్డ్ అంఫైర్లతో కలిసి జోక్యం చేసుకొని సుమిత్, క్రిష్ లను విడదీయాల్సి వచ్చింది. లేడీ అంపైర్ క్రిష్ ను ఫీల్డ్ నుంచి వెళ్లిపోవాలని కోరగా.. నితీశ్ రాణా సుమిత్ భుజం చుట్టూ చేయి వేసి వెనక్కి తీసుకెళ్లడంతో గొడవ సద్దు మణిగించింది.
Things got 𝐡𝐞𝐚𝐭𝐞𝐝 between Digvesh Rathi and Nitish Rana 👀pic.twitter.com/KqIkB6DYCE
— Cricbuzz (@cricbuzz) August 30, 2025