BigTV English

Brahmamudi Serial Today August 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: హాస్పిటల్‌ నుంచి ఇంటికి వచ్చిన రాజ్‌ – నిజం చెప్పిన అపర్ణ  

Brahmamudi Serial Today August 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: హాస్పిటల్‌ నుంచి ఇంటికి వచ్చిన రాజ్‌ – నిజం చెప్పిన అపర్ణ  
Advertisement

Brahmamudi serial today Episode: రాజ్‌కు గతం గుర్తుకు వచ్చిందని తెలిసి ఇంటికి వెళ్లి పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. ఇక ఆ కావ్యను వదలను దాన్ని అంతం చేసి బావను నా సొంతం చేసుకుంటాను అంటుంది. దీంతో యామిని వాళ్ల నోర్మూయ్‌ అంటూ తిడతాడు. ఇక నీ పనులన్నీ ఆపేయ్‌. రాజ్‌ ఎప్పటికీ ఆ కావ్య సొంతమేనని ఇప్పుడు రుజువైంది. వాళ్లది విడదీస్తే విడిపోయే బంధం కాదని ఇవాళ రుజువైంది. ఇక రాజ్‌ను మర్చిపోయి కొత్త జీవితం స్టార్ట్‌ చేయ్‌ అని చెప్తాడు. దీంతో రాజ్‌ను నేను మర్చిపోలేను డాడ్‌ అవసరం అయితే రాజ్‌ కోసం చచ్చిపోతాను అంటూ బెదిరిస్తుంది. దీంతో చూడు యామిని ఒక తండ్రిగా నువ్వు ఏదైనా అడిగితే ఇవ్వాల్సిన బాధ్యత నాది కానీ నువ్వు అడుగుతుంది. ఒక మనిషి ప్రేమ అది డబ్బులకు రాదు.  నువ్వు పుట్టినప్పటి నుంచి ఏడుస్తూ మమ్మల్ని సంతోషపెట్టావు.. ఇప్పుడు ఏడుస్తూ మమ్మల్ని బాధపెట్టకు ఇప్పటికైనా మారు అంటూ చెప్పి వెళ్లిపోతాడు యామిని వాళ్ల ఫాథర్‌.


మరోవైపు హాస్పిటల్‌ లో అందరూ ఐసీయూ బయట నిలబడి ఉంటారు. అపర్ణ ఇప్పుడు చెప్పండి డాక్టర్‌ మా రాజ్‌కు ఏమైంది అని అడుగుతుంది. దీంతో డాక్టర్‌ మీ రాజ్‌ ఎక్కడైతే గతం మర్చిపోయారో అక్కడే తిరిగి గతం గుర్తు చేసుకున్నాడు. ఆరోజు వాళ్లిద్దరూ శ్రీశైలం వెళ్లినప్పుడు యాక్సిడెంట్‌ అయ్యింది కదా మధ్యలో జరిగిన విషయాలు ఏవీ తనకు గుర్తు లేవు అని చెప్తాడు. దీంతో రుద్రాణి ఏంటి డాక్టర్‌ ఏవేవో కట్టుకథలు చెప్పి మా దగ్గర డబ్బులు గుంజాలని చూస్తున్నారా..? గతం గుర్తొచ్చింది కానీ మధ్యలో విషయాలు మర్చిపోయారని కథలు చెప్తున్నారు. అలా ఎలా పాసిబుల్‌ అవుతుంది అంటూ డాక్టర్‌ను అనుమానిస్తుంది. దీంతో డాక్టర్‌ కోపంగా మీకు మా మీద నమ్మకం లేకపోతే వేరే హాస్పిటల్‌కు తీసుకెళ్లి సెకండ్‌ ఓపినీయన్‌ తీసుకోవచ్చు అంతేకానీ ఇలా మీరు మమ్మల్ని అవమానించి మాట్లాడితే నేను ఊరుకోను అంటూ వార్నింగ్‌ ఇస్తాడు.

దీంతో సుభాష్‌ కోపంగా రుద్రాణి నువ్వ కాసేపు నోరు మూస్తావా..? సారీ డాక్టర్‌ తనను పట్టించుకోకండి.. ఇప్పుడు తను అలా మర్చిపోవడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందా..? అని అడగ్గానే.. ఎలాంటి ప్రాబ్లమ్‌ రాదు. ఇక నుంచి రాజ్‌ మీ అబ్బాయి లాగే ఉంటాడు. తనకు చిన్నప్పటి నుంచి ఉన్న విషయాలన్నీ గుర్తుకు ఉంటాయి. కాకపోతే యాక్సిడెంట్‌ జరగినప్పటి నుంచి జరిగిన విషయాలు మాత్రం గుర్తుకు ఉండవు.. అని డాక్టర్‌ చెప్పగానే.. ఆ దరిద్రాన్ని గుర్తు పెట్టుకోవాలని మేము కూడా అనుకోవడం లేదు డాక్టర్‌. ఇంతకీ మా మనవణ్ని ఎప్పుడు డిశార్చ్‌ చేస్తారు అని అడుగుతుంది. దీంతో ఈరోజే డిశార్చ్‌ చేస్తాం.. కాకపోతే తను స్ట్రెస్‌ తీసుకోకుండా చూసుకోవాలి అంతే చాలు అని చెప్పి డాక్టర్‌ వెళ్లిపోతాడు. ఏంటి కావ్య ఇంకా చూస్తున్నావు నువ్వు చేసిన పూజలు వ్రతాలు అన్ని ఫలించినట్టు ఉన్నాయి. ఆ దేవుడు కరుణించి నీ మొగుణ్ని నీకు అప్పగించేశాడు. వెళ్లు వెళ్లి వాడితో సంతోషంగా మాట్లాడు అని చెప్తుంది ఇంద్రాదేవి.


అమ్మా కావ్య ఇప్పుడు మా అందరికంటే నీ అవసరమే వాడికి ఎక్కువ ఉందమ్మా.. వెళ్లు వెళ్లి మాట్లాడు. అని సుభాష్‌ చెప్తాడు. అపర్ణ కూడా వెళ్లు కావ్య వెళ్లి వాడితో మాట్లాడు కావ్య అని చెప్పగానే కావ్య ఐసీయూలోకి వెళ్తుంది. వెళ్లి  రాజ్‌ చేయి పట్టుకోగానే రాజ్‌కు స్పృహ వస్తుంది. ఎక్కడికి వెళ్లిపోయావు.. అని అడుగుతాడు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్లిపోతాను బయటే ఉన్నాను..అని కావ్య చెప్తుంది. దీంతో రాజ్  ఇప్పుడు కాదు నేను కళ్లు తెరచినప్పుడు నా ముందు నువ్వే ఉండాలి కదా..? ఎందుకు లేవు అని అడుగుతాడు. గతం గుర్తుకు రాగానే మొండితనం కూడా బయటపడుతుంది. అని మనసులో అనుకుంటుంది కావ్య.  తర్వాత రాజ్‌ను ఇంటికి తీసుకుని వెళ్తారు. అందరూ హాల్లో కూర్చుని సంతోషంగా కబుర్లు చెప్పుకుంటుంటే..కావ్య ఏడుస్తూ.. పైకి వెళ్తుంది. ఎందుకు ఏడుస్తూ వెళ్లింది అని రాజ్‌ అడగ్గానే కట్టుకున్న భర్తే అనుమానిస్తే ఏడవకుండా ఉంటుందో తెలుసా..? అంటూ నోరు జారుతుంది. అందరూ షాక్‌ అవుతారు.

ఏం జరిగిందో చెప్పమని రాజ్‌ అడుగుతాడు. దీంతో అపర్ణ జరిగింది మొత్తం చెప్తుంది. తన మనసులో ఉన్న భారాన్ని కడిగేయాలని ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. వెళ్లరా ఇప్పటికైనా వెళ్లి తనను ఓదార్చు.. తన కష్టానికి తోడు కాలేకపోయావు. కనీసం తన కన్నీళ్లు తుడవడానికైనా తోడుగా ఉన్నానని నిరూపించు వెళ్లు నాన్న. అని అపర్ణ చెప్పగానే.. రాజ్‌ మెల్లగా లేచి పైకి వెళ్తాడు. రూంలో ఏడుస్తున్న కావ్య దగ్గరకు వెళ్లి రాజ్‌ కూడా ఎమోషనల్‌ అవుతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Big tv Kissik Talks: నన్ను తీసుకెళ్లిపో శివయ్యా.. హరితేజ కోరికలు వింటే షాక్ అవ్వాల్సిందే.. బాబోయ్!

Big tv Kissik Talks: బుద్దుంటే ఆపని చెయ్యను.. బిగ్ బాస్ పై ఫైర్ అయిన హరితేజ!

Priyanka Jain: పెళ్లి కాకుండానే డ్రీమ్ హోమ్.. ఏకంగా కోటి ఖర్చు అంటూ!

Kavya Shree: కావ్యకు ఆల్రెడీ పెళ్ళైందా..? ఇదేం ట్విస్ట్ మావా..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి నర్మద వార్నింగ్..రామారాజుకు క్షమాపణలు..ధీరజ్ పై ప్రేమ రివేంజ్..

Nindu Noorella Saavasam Serial Today october 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి శాడిజానికి భయపడ్డ రణవీర్‌

Brahmamudi Serial Today October 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  కనకం ఇంటి ముందు దీక్షకు దిగిన రాజ్

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. అవనికి డెడ్ లైన్.. కన్నీళ్లు పెట్టుకున్న రాజేంద్రప్రసాద్..

Big Stories

×