BigTV English
Advertisement

Pawan Kalyan: పదేళ్లు వెయిటింగ్ తప్పదా? అంత మాట అనేశారేంటి? పవన్ నెక్స్ట్ ప్లాన్ అదేనా?

Pawan Kalyan: పదేళ్లు వెయిటింగ్ తప్పదా? అంత మాట అనేశారేంటి? పవన్ నెక్స్ట్ ప్లాన్ అదేనా?

ఛాన్స్ వదులుకుంటున్నారా?


⦿ నైరాశ్యంలో పవన్ ఫ్యాన్స్
⦿ అభిమానుల్లో అగ్గి రాజేస్తున్న పవన్ వ్యాఖ్యలు
⦿ మరో పదేళ్లు బాబే సీఎం అన్న పవన్
⦿ పవన్ సీఎం అవుతారని ఎదురుచూపులు
⦿ పదేళ్లూ పవన్ కు అండదండగా ఉన్న ఫ్యాన్స్
⦿ రోజురోజుకూ బలం పుంజుకుంటున్న జనసేన
⦿ వైకాపాకి గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో జనసేన
⦿ మోదీ మద్దతు కూడా పవన్ కే
⦿ వైకాపా నుంచి పెరిగిన వలసలు
⦿ సీఎం సీటులో చూడాలనుకుంటున్న కాపునేతలు

అమరావతి,స్వేచ్ఛ: Pawan Kalyan:
గత ఎన్నికలలో తాను పోటీచేసిన రెండు స్థానాలలోనూ ఓడిపోయారు పవన్ కళ్యాణ్. పవన్ పని అయిపోయింది. ఇక రాజకీయ అస్త్ర సన్యాసం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రతిపక్షాలు గేలిచేశాయి. అయినా అవన్నీ పట్టించుకోకుండా పవన్ కళ్యాన్ తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగారు. గత ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం బాగా కనిపించింది. అనూహ్యంగా కూటమి పక్షాలకు అఖండ విజయం అందించారు ప్రజలు. జనసేన కూడా తనకు కేటాయించిన సీట్లను నిలబెట్టుకోవడమే కాకుండా రెండు పార్లమెంట్ సీట్లు కూడా గెలిపించుకుంది. పవన్ ఏ పదవీ ఆశించకుండానే డిప్యూటీ సీఎం వంటి కీలక పదవి లభించింది. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా జనసేన ప్రభంజనమే కనిపిస్తోంది. అయితే జనసేనాని ఉండుండి ఓ బాంబు పేల్చారు. శాసనసభ సాక్షిగా మరో పదేళ్లు చంద్రబాబే సీఎం అని స్టేట్ మెంట్ ఇచ్చిపారేశారు.
ఇపపుడు అభిమానులకు అదే మింగుడు పడటం లేదు.


పదేళ్లుగా ఎదురుచూపులు
తమ అభిమాన నాయకుడిని సీఎంగా చూద్దామని పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్ .అనుకోకుండా అనూహ్యంగా జనసేనకు వైసీపీ నుంచి వలసలు మొదలయ్యాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ సీఎం అని అందరూ అనుకుంటున్నారు. వయసు రీత్యా చంద్రబాబు కూడా వేరొకరికి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి. ప్రస్తుతం సీఎం రేసులో ఉన్న లోకేష్ కన్నా పవన్ అన్ని విషయాలలోనూ ముందంజలో ఉన్నారు. ఇక కేంద్రంలో బీజేపీ మద్దతు ఎలాగూ ఉండనే ఉంది. ఇన్ని అనుకూలతలు ఉండగా పవన్ ఎందుకలా మరో పదేళ్లు చంద్రబాబే సీఎం అని ఎందుకన్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.

పెరిగిన వలసలు
జనసేనను స్థాపించిన పదేళ్ల తర్వాత అధికార పగ్గాలు చేపట్టారు జనసేనాని. నిదానమే ప్రదానమనే సిద్ధాంతాన్ని అనుసరించే పవన్ కళ్యాణ్ పదవులు ఆశించకుండా..పార్టీని భూస్థాపితం చేయకుండా..ఏ పార్టీలోనూ విలీనం చేయకుండా..కేవలం తనని నమ్ముకున్న కార్యకర్తల కోసం పార్టీ సిద్ధాంతాలనే నమ్ముకుని నడిపించుకుంటూ వస్తున్నారు. పార్టీ స్థాపించినప్పుడు ఆర్థిక సమస్యలు. అందుకోసమే సినిమాలలో నటించి దాని ద్వారా వచ్చే ఆదాయంతో పార్టీని నడిపించుకుంటూ మధ్యమధ్య ఉచితంగా సామాజిక సేవలు, తన సొంత డబ్బుతో విద్యార్థులకు ఫీజులు, పేదలకు వైద్య సేవలు లాంటి గుప్త సాయాలు చేస్తూ వచ్చారు. మొన్నటి ఎన్నికలలో అనూహ్యంగా బీజేపీని టీడీపీని తన జనసేనతో కలిపి ఓ కూటమిని ఏర్పాటు చేశారు. జగన్ పై జన గర్జన చేశారు. పదేళ్ల తపస్సు ఫలించింది.

ఓటమి నుంచి కూటమి దాకా..
ప్రజలలో అనూహ్యంగా నమ్మకం పెరిగిపోయింది. ఇప్పుడు ఓటమి నుంచి కూటమి దాకా చేరుకున్నారు. ఇప్పుడు కూటమిలో ఉన్న మూడు పార్టీలలో జనసేనకు అనూహ్యంగా వలసలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నుంచి జనసేనకు క్యూ కడుతున్నారు.
వైసీపీ కూడా వచ్చే అసెంబ్లీ నాటికి పుంజుకోవడం కష్టమే. అలాంటప్పుడు జనం కొత్త నేతను కోరుకోవడం సహజమే. జగన్ కూడా ఒక్క ఛాన్స్ అంటూ వచ్చారు. అయితే ఆ ఛాన్స్ దుర్వినియోగం కావడంతో అది కాస్తా మొన్నటి ఎన్నికలలో మిస్ ఫైర్ అయింది. మళ్లీ జగన్ కు అధికారం రావాలంటే విశ్వప్రయత్నమే చేయాలి. ఈలోగా జనసేన మరింత బలంగా తయారవుతోంది. బీజేపీ సపోర్టు తో వచ్చే ఎన్నికలలో క్రియాశీలక శక్తిగా మారనుంది.

కార్యకర్తల అండదండలు
ఇన్నాళ్లూ పవన్ స్థాపించిన జనసేన నుంచి కార్యకర్తలు కూడా పార్టీని ,తమ నేతను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. వారికి కావలసిందల్లా తమ నాయకుడిని సీఎం సీటులో చూడాలని. ఇంతకాలం కళ్లలో ఒత్తులు వేసుకుని ఈ అవకాశం కోసమే ఎదురుచూశారు. అయితే పవన్ ను అనూహ్యంగా డిప్యూటీ సీఎం పదవి వరించింది. రాష్ట్రంలో సెకండ్ ప్లేస్ దక్కించుకున్నారు. ఇటు చంద్రబాబు, అటు మోదీ కూడా పవన్ కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.  అయితే మొదటి నుంచీ పదవీ వ్యామోహం లేనట్లుగా ఉండే పవన్ కళ్యాణ్ కు ఇది తేలికైన విషయమే. కాగా కార్యకర్తలు మాత్రం జీర్ణించుకోలేకపోవున్నారు.

కాపు వర్గం ఆశలు
ఇక ఎప్పటినుంచో కాపు వర్గం నేతలు కూడా తమ సత్తా నిరూపించుకునే సమయం వచ్చిందని ఆనందపడుతున్నారు. చిరంజీవి సైతం కాపు వర్గం మద్దతు దక్కించుకోలేకపోయారు. కనీసం పదళ్లకయినా పవన్ కు ఆ ఆవకాశం లభించింది. ఈ పరిస్థితిలో తమ వర్గానికి అండగా ఉంటాడు పవన్ అని భావిస్తున్న తరుణంలో పవన్ పేల్చిన బాంబు కాపు వర్గాలు సైతం జీర్ణించుకోలేకపోతున్నాయి.

గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంటున్నారా?
పవన్ చెప్పినదాన్ని బట్టి మరో పదేళ్లు అంటే ఇప్పటి ఐదేళ్లతో కలుపుకుంటే మరో పదేళ్లు కలిపి 15 సంవత్సరాలన్నమాట. 15 ఏళ్లు ఎదురుచూడటమంటే మాటలు కాదు. పవన్ మాత్రం గోల్డెన్ ఛాన్స్ వదులుకుంటున్నారని కార్యకర్తలు, కాపు వర్గం భావిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలపరిచే సమయం వచ్చింది. వైకాపా కూడా రేసులో వెనకబడింది. ఇదే సమయంలో జనం కూడా పవన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో పవన్ డైలాగ్ అందరినీ డైలమాలో పడేసింది.

Related News

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Big Stories

×