BigTV English

Jailer 2: ‘జైలర్ 2’ నుండి క్రేజీ అప్డేట్.. ఆరోజు నుండే షూటింగ్ మొదలు

Jailer 2: ‘జైలర్ 2’ నుండి క్రేజీ అప్డేట్.. ఆరోజు నుండే షూటింగ్ మొదలు

Jailer 2 Update: ఈరోజుల్లో ఒక సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా దానికి సీక్వెల్ తెరకెక్కిస్తే బాగుంటుంది అనే ప్లాన్‌లో మేకర్స్ ఉంటున్నారు. అందుకే సగం కథను ఫస్ట్ పార్ట్‌లో చెప్పి.. మిగతా కథతో సీక్వెల్‌ను సిద్ధం చేస్తున్నారు. అలా తెరకెక్కే సీక్వెల్ హిట్ అయిన సందర్భాలు తక్కువే అయినా చాలామంది మేకర్స్ ఈ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటున్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా అదే చేయబోతున్నారు. యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ (Rajinikanth) నటించిన సినిమానే ‘జైలర్’. ఈ మూవీ రెండేళ్ల క్రితం విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ అవ్వగా ఇప్పుడు దీని సీక్వెల్ కోసం పనులు మొదలయ్యాయని తెలుస్తోంది.


‘జైలర్ 2’ కోసం

అప్పట్లో ‘జైలర్’ సినిమా మరెన్నో ఇతర చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ‘జైలర్’ సమయానికి నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) ఫ్లాప్స్‌లో ఉండడంతో అసలు తనకు అవకాశం ఎందుకు ఇస్తున్నారా అని చాలామంది రజినీకాంత్‌ను విమర్శించారు. కానీ రజినీ.. తనపై పెట్టిన నమ్మకాన్ని నెల్సన్ నిలబెట్టుకున్నాడు. ఇక ‘జైలర్’కు సీక్వెల్ తెరకెక్కించే అవకాశం ఉంది అన్నట్టుగా ఈ మూవీని ముగించారు. దీంతో సీక్వెల్ కూడా ఇదే రేంజ్‌లో హిట్ అవుతుందని ఫ్యాన్స్ అప్పుడే ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం రజినీకాంత్ చేతిలో ఉన్న సినిమాలు దాదాపు షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ‘జైలర్ 2’కు సమయం వచ్చేసిందని తెలుస్తోంది.


Also Read: ధృవ్ విక్రమ్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్… ‘మంగళవారం’ డైరెక్టర్ తో మాత్రం కాదండోయ్

ప్రోమో షూట్

2024 డిసెంబర్‌లో ‘జైలర్ 2’ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సీక్వెల్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా.. ప్రోమో షూట్‌కు కూడా ముహూర్తం ఖరారు అయినట్టు సమాచారం. డిసెంబర్ 12న సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ‘జైలర్ 2’కు సంబంధించిన ప్రోమో షూట్ వీడియో విడుదల కానుందట. ఇక డిసెంబర్ 12న ఆ వీడియోను విడుదల చేయడం కోసం డిసెంబర్ 5నే ఈ ప్రోమో షూట్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. చెన్నైలో ‘జైలర్ 2’ ప్రోమో షూట్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్ అందరినీ ఈ అప్డేట్ తెగ సంతోషపెడుతోంది.

దాని తర్వాతే

‘జైలర్ 2’ (Jailer 2) ప్రోమో షూట్‌తో పాటు లక్ టెస్ట్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ షూట్ కూడా డిసెంబర్ మొదటి వారంలోనే పూర్తి చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే రజినీకాంత్ పుట్టినరోజున బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటికి రావడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ మూవీలో నటిస్తున్నారు రజినీకాంత్. ప్రస్తుతం ఈ షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత 2025 మొదట్లోనే ‘జైలర్ 2’ సెట్‌లో అడుగుపెట్టనున్నారు రజినీ. ‘జైలర్ 2’లో రజినీకాంత్‌ను టైగర్ ముత్తువేల్ పాండియన్ ఐపీఎస్‌గా చూడడానికి ఫ్యాన్స్ అంతా ఎగ్జైట్ అవుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×