OTT Movie : ఇండోనేషియా నుంచి వచ్చే హారర్ సినిమాలు ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి ఎక్కువగా హారర్ సినిమాలే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చేతబడి అంశంతో వీళ్ళు సినిమాలు తీస్తూ ఉంటారు. ఈ సినిమాలను ఒంటరిగా మాత్రం చూసే ధైర్యం చాలామంది చేయరు. అంతలా మనుషుల్ని భయపెట్టిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా చేతబడి అంశంతో తెరకెక్కింది. ఈ సినిమా చివరి వరకు భయంకరమైన సన్నివేశాలతో ప్రేక్షకులను బెదరగొడుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
స్టోరీలోకి వెళితే
సుసిప్టో అనే వ్యక్తి అడవిలో దొరికే అరుదైన వస్తువులను అమ్ముతూ, తన వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతుంటాడు. కానీ అతని సోదరుడు సర్ది వ్యాపారం అనుకున్నంతగా ముందుకు సాగదు. అతనికి అక్కడ ఉన్న కొంతమంది పై అసూయ కలుగుతుంది. మార్కెట్‌లోని మరొక వ్యాపారి విచాక్ తో పాటు, సుసిప్టో కుటుంబాలు నాశనం కావాలని ‘సెవెన్ సీస్ బ్లాక్ మ్యాజిక్’ అనే శక్తివంతమైన నల్లమంత్రాన్ని ఇతను ప్రయోగిస్తాడు. సుసిప్టోకి వ్యాపారంలో మరో పెద్ద డీల్ వస్తుంది. ఆ తర్వాత అతని కుటుంబంలో దారుణమైన సంఘటనలు జరుగుతాయి. భార్య మార్ని, కొడుకు ఆర్డి, కూతురు సైఫా, చిన్న కొడుకు ఆరిఫ్ వరుసగా అనారోగ్యానికి గురవుతారు. సుసిప్టో కొడుకు ఆర్డికి చిన్నతనంలో కిడ్నీ శస్త్రచికిత్స జరుగుతుంది.
అయితే ఆరిఫ్ కి దెయ్యాలను చూడగలిగే శక్తి వస్తుంది. దెయ్యాలు ఈ కుటుంబం పై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. దీనివల్ల అతను తమ కుటుంబం పై నల్ల మంత్రంతో చేతబడి చేశారని, అందుకే దెయ్యాలదాడి జరిగిందని గుర్తిస్తాడు. ఈ కుటుంబం శాపం నుండి బయటపడేందుకు, ఆర్డి, సైఫా ఏడు సముద్ర తీరాల నుండి నీటిని సేకరించి, ఆ నల్ల మంత్రానికి శుద్ధి చేయాలని నిర్ణయిస్తారు. వాళ్ళు ఏడు పుణ్యక్షేత్రాలను సందర్శించి ఆ పవిత్రమైన నీటిని సేకరిస్తారు. చివరికి ఆ నీళ్ళు దుష్ట శక్తిని అంతం చేస్తాయా ? సుసిప్టో కుటుంబం కొలుకుంటుందా ? అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : బ్యాచిలర్ పార్టీలో ఫ్రెండ్ మిస్సింగ్ … కేక పెట్టించే కామెడీ థ్రిల్లర్ … ప్రత్యేక పాత్రలో మైక్ టైసన్ …
నెట్ ఫ్లిక్స్ (Netflix)లో
ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘కర్స్ ఆఫ్ ది సెవెన్ ఓషన్స్’ (Curse of the Seven Oceans). 2024 లో వచ్చిన ఈ సినిమాకి టామీ దేవో దర్శకత్వం వహించాడు. దీని ఒరిజినల్ టైటిల్ (Santet Segoro Pitu). ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.