BigTV English

Tadipatri politics: తాడిపత్రిలో హైటెన్షన్.. ఏడాది తర్వాత పెద్దారెడ్డి ఎంట్రీ, భారీగా పోలీసుల మోహరింపు

Tadipatri politics:  తాడిపత్రిలో హైటెన్షన్..  ఏడాది తర్వాత పెద్దారెడ్డి ఎంట్రీ, భారీగా పోలీసుల మోహరింపు


Tadipatri politics: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏడాది తర్వాత రాజకీయాలు వేడెక్కాయి. దాదాపు 14 నెలల తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగు పెట్టనున్నారు.  ఈనేపథ్యంలో  జేసీ వర్సెస్ పెద్దారెడ్డి వర్గాల మధ్య  ఏమైనా అల్లర్లు జరుగుతాయని భావించి భారీగా పోలీసులు మొహరించారు. ఇంత హైటెన్షన్‌కు కారణమేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

తాడిపత్రి రాజకీయాల గురించి చెప్పనక్కర్లేదు. రాజకీయాలు ఏమోగానీ జేసీ వర్సెస్ పెద్దారెడ్డి వర్గాల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. వైసీపీ హయాంలో రెచ్చిపోయిన పెద్దారెడ్డి వర్గీయులు ఏకంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి తమ ప్రతాపం చూపించారు. ఆయన ఇంట్లో కాసేపు కూర్చొన్నారు కూడా. దీన్ని ఆగ్రహించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. పెద్దారెడ్డి కూర్చున్న కుర్చీని తగలబెట్టారు. ఈ లెక్కన అక్కడ ఇరువురు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.


మొన్నటి ఎన్నికల తర్వాత పెద్దారెడ్డిని తాడిపత్రి రానివ్వలేదు జిల్లా పోలీసులు. ఇరువర్గాల మధ్య ఏమైనా అల్లర్లు జరుగుతాయని భావించి పెద్దారెడ్డిని జిల్లాకు రాకుండా దూరంగా పెట్టారు.  పరిస్థితి గమనించిన పెద్దారెడ్డి నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. చివరకు న్యాయస్థానం ఆదేశాలతో తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అడుగుపెడుతున్నారు.

ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య అల్లర్లు జరుగుతాయని భావిస్తున్నారు పోలీసులు. తాడిపత్రి టౌన్ అంతటా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. పెద్దారెడ్డి ఎంట్రీ ఇచ్చే సమయంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి మరో కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. పట్టణంలో శివుడి విగ్రహావిష్కరణకు వెళ్తున్నారు.

ALSO READ: అర్జెంటుగా ఢిల్లీకి లోకేష్.. కారణం అదే?

ఈ వ్యవహారంపై బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఐదు వాహనాలతో తాను తాడిపత్రి వెళ్తున్నానని చెప్పారు. సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో చేరుకోనున్నట్లు చెప్పుకొచ్చారు. పోలీసులపై నమ్మకంతో వెళ్తున్నానని,  తనను పంపిస్తారా లేదా అన్నది అధికారులపై ఆధారపడి ఉంటుందన్నారు.

పార్టీ కార్యకర్తలు ఎవరూ రానని, వారికి ఇప్పటికే సమాచారం ఇచ్చామన్నారు. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకుందామని, ఏదైనా జరిగితే న్యాయస్థానానికి వెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలిపారు. అనుచరులు 40 నుంచి 50 మంది వరకు ఉంటారని, నాలుగైదు వాహనాల్లో వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

గొడవలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు మనసులోని మాట వెల్లడించారు పెద్దారెడ్డి. తాడిపత్రి వెళ్లేందుకు రెండు లేదా మూడుదారులు ఉన్నాయన్నారు. జేసీ ఒక దారిలో వస్తే.. తాను మరొక దారిలో వెళ్తానని తెలియజేశారు. పోలీసులు ఎలాంటి సూచనలు ఇస్తే ఆ విధంగా ఫాలో అవుతామన్నారు మాజీ ఎమ్మెల్యే.

 

Related News

Kuna Ravi Kumar: KGVB ప్రిన్సిపల్‌ ఆరోపణలపై ఎమ్మెల్యే కూన రవి రియాక్ట్..

Adarana 3 Scheme: ఆదరణ 3.0 స్కీమ్.. లబ్దిదారులకు టూ వీలర్స్, ఇక పండగే

Weather Report: ఏపీకి రానున్న మూడు రోజులు నాన్‌స్టాప్ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

Nara Lokesh: అర్జెంటుగా ఢిల్లీకి లోకేష్.. కారణం అదే?

CM Chandrababu: సీఎం చంద్రబాబు కన్నెర్ర.. ముగ్గురికి మూడింది? రేపో మాపో యాక్షన్ తప్పదా?

Big Stories

×