Big Stories

Challa: చల్లా వారి కుటుంబ కథా ‘చిత్రం’.. అసలేం జరిగిందంటే..!

challa family war

Challa: ఒక ఫోటో కోసం కర్నూలు జిల్లాలోని ఓ చరిత్ర కలిగిన రాజకీయ కుటుంబం బజారుకెక్కింది. రెండు వర్గాలుగా వీడిపోయి బాహాబాహికి దిగింది. ఇంటినే కదనరంగంగా మార్చేశారు ఆ కుటుంబ సభ్యులు. అక్కడితో ఆగలేదు ఈ పంచాయితీ.. పోలీస్ స్టేషన్‌ కు కూడా చేరింది. ఇంతకీ ఈ రచ్చ ఫోటో కోసమేనా? ఫోటో సాకుతో ఇప్పటి వరకు జరుగుతున్న కోల్డ్ వార్.. అసలు వార్‌ కు దారి తీసిందా? ఇంతకీ ఎవరిదా కుటుంబం? ఏంటా గొడవ?

- Advertisement -

దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి.. కర్నూలు జిల్లాలోనే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లోనూ ఫేమస్. అలాంటి కుటుంబంలో ఇప్పుడు వారసత్వ పంచాయితీ. అసలు వారసులం తామంటే తామే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. చల్లా రామకృష్ణారెడ్డి కోడలు, అవుకు జడ్పీటీసీ శ్రీలక్ష్మికి, చల్లా పెద్ద కుమారుడు విఘ్నేశ్వర్‌ రెడ్డి మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. రామకృష్ణా రెడ్డి ఫోటో కోసం రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడ్డారు.

- Advertisement -

అవుకు కేంద్రంగా చల్లా కుటుంబ రాజకీయం నడుస్తోంది. NTR TDPని స్థాపించినప్పుడు 83లో పాణ్యం MLAగా ఎనికయ్యారు చల్లా రామకృష్ణారెడ్డి. పార్టీలు మారుతూ వైసీపీలోకి వచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన మరణంతో రెండో రెండో కూమారుడు చల్లా భగీరథరెడ్డి కి MLCగా అవకాశం ఇచ్చింది అధిష్టానం. అయన కూడా అనారోగ్యంతో మరణించడం.. చల్లా ఫ్యామిలీలో వారసత్వ పంచాయతీకి బీజం వేశాయి.

భగీరథరెడ్డి మరణించిన తర్వాత ఆయన భార్య శ్రీలక్ష్మీకి MLC అవకాశం వస్తుందని భావించారు. అవుకు ZPTCగా ఉన్నారు శ్రీలక్ష్మీ. అయితే శ్రీలక్ష్మీకి MLC ఇచ్చేందుకు చల్లా కుటుంబ సభ్యులు అంగీకరించలేదని ప్రచారం. దీంతో ఆమె వేరు కుంపటి పెట్టారు. తనకంటూ ప్రత్యేకంగా ఓ గ్రూప్‌ సిద్ధం చేసుకున్నారు. రాజకీయ కార్యకలాపాలతో యాక్టివ్‌ అయ్యారు. ఈ పంచాయితీని ఆమె వైసీపీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద కూడా ఈ విషయాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. దీంతో కుటుంబ పరువు బజారున పడుతుందని చల్లా బంధువులు ఆమె వర్గం నేతలకు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. కుటుంబ గొడవల పుణ్యమా అని చల్లా కుటుంబానికి MLC పదవి దక్కలేదు.

శ్రీలక్ష్మీకి, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. తెర వెనుక ఇంత తతంగం నడుస్తుండగా.. చల్లా ఫోటో వివాదం చెలరేగింది. దీంతో అవుకులో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. ఇరు వర్గాలు సై అంటే సై అనుకున్నట్టుగా తెలుస్తోంది. చల్లా పెద్ద కుమారుడు విఘ్నేశ్వర్‌ రెడ్డితో పాటు.. చల్లా సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారంటూ శ్రీలక్ష్మీ ఆరోపణ. తన కార్యాలయంలో తనకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి.. తిట్టాడంటోంది శ్రీలక్ష్మీ.

అవుకులో పరిస్థితి ప్రస్తుతం నివురు గప్పిన నిప్పులా ఉంది. ఉద్రిక్తతలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News