E-Paper
Advertisement

సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేసిన నందమూరి లక్ష్మీపార్వతి.. ఏమన్నారంటే?

సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేసిన నందమూరి లక్ష్మీపార్వతి.. ఏమన్నారంటే?
Advertisement

Lakshmi Parvathi: నా అల్లుడు నాకంటే గొప్ప నటుడు అని ఎన్టీఆర్‌ ఎప్పుడో చెప్పారు. చంద్రబాబు నటన ఆస్కార్‌ స్థాయిలో ఉందని ప్రచారం కోసం ప్రతి నెలా ఓ కార్యక్రమం జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టడం, తనను తాను పొగుడుకోవడమే చంద్రబాబు పని అని నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. ఒకే పింఛన్‌ పథకాన్ని 22 సార్లు ప్రారంభించిన ఘనత చంద్రబాబుదేనని కొత్తగా ఒక్క పింఛన్‌ కూడా ఇవ్వకుండా, పాత పింఛన్లలో లబ్ధిదారులను తగ్గించి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

గత ప్రభుత్వ పథకాలే..

స్థానిక ఎన్నికల వేళ 34 శాతం బీసీ రిజర్వేషన్ల పేరుతో రాజకీయ నాటకాలు ఈ అంశాన్ని కోర్టుకు తీసుకెళ్లింది చంద్రబాబేనని అన్నారు. వైయ‌స్‌ జగన్‌ హయాంలో నామినేటెడ్‌ పదవులు, పనుల్లో బీసీలకు పెద్దపీటవేసారని, బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుతో సామాజిక న్యాయం చేశారని అన్నారు. అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. గత ప్రభుత్వ పథకాలనే మళ్లీ ప్రారంభిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. భోగాపురం విమానాశ్రయానికి భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, నిర్మాణ పనుల్లో వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం కీలకంగా పనిచేస్తే.. ఇప్పుడు చంద్రబాబు క్రెడిట్‌ చోరీ చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు పై సెటెర్లు..

Advertisement

పట్టాదారు పాస్‌పుస్తకాల తయారీలో సాంకేతికతతో భూముల రీసర్వే చేపట్టి రైతులకు అందించిన ఘనత వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వానిదేనని అదే పట్టాదారు పాస్‌పుస్తకాలను ఫొటోలు మార్చి మళ్లీ మళ్లీ ప్రారంభించడం ఐదుసార్లు ప్రారంభించినా ప్రచారం మాత్రం ఆగడం లేదని ఫైర్ అయ్యారు. అమెజాన్‌ అడవుల్లో అరుదైన జీవి కనిపించినట్లే ఆంధ్రప్రదేశ్‌లో మానవ విలువలు లేని విచిత్ర జీవి ఉందంటూ చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం, అవినీతి సొమ్ముతో వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారని, రాయలసీమలో కరువు, ఎండిపోతున్న పంటలు, తాగునీటి కొరత అయినా లక్ష కోట్ల ఖర్చు చేశామంటూ గొప్పలు చెప్పుకోవడం ఏమిటి? అని ప్రశ్నించారు.

Also read: సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. నీటికుంటలో పడి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!

మద్దతు ధర ఇచ్చారా?

Advertisement

రాయలసీమ రైతులకు నీరు అందించలేని ప్రభుత్వం ఎల్‌నీనో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ఎందుకు చర్యలు తీసుకోలేదు? విశాఖలో వర్షం తన ప్రార్థనల వల్లే కురిసిందన్న చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం.. మంచి జరిగితే తన ఖాతాలో, చెడు జరిగితే అధికారులపై నెట్టేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనలు, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని అన్నారు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలు అమలుకు నోచుకోలేదు.. కొత్త పింఛన్లు, ఇతర హామీలపై ప్రజలకు సమాధానం చెప్పాలని, రైతులకు పంటల సమయంలో మద్దతు ధర ఇచ్చారా? టమాటా, మిర్చి, పొగాకు సహా ఏ పంటకైనా సరైన ధర కల్పించారా? అని ప్రశ్నించారు.

చంద్రబాబుకి సవాల్..

వైయ‌స్‌ జగన్‌ పాలనలో విద్య, వైద్యం, రైతు సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చారు. దానిని విధ్వంసకర పాలనగా చిత్రీకరించడం తగదని, గొడ్డలి పార్టీ ఎవరిది? హత్యల చరిత్రను పరిశీలిస్తే అసలు నిజాలు బయటపడతాయని అన్నారు. కేంద్రం నుంచి వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కార్యక్రమాలకు వచ్చిన అవార్డులను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. పులివెందులకు నీళ్లు ఇచ్చామంటూ కూటమి నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. మద్యం ధరలపై పారదర్శకత ఉందన్న చంద్రబాబు మాటలకు క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. బెల్ట్‌షాపులు విచ్చలవిడిగా పెరిగాయని అన్నారు. జగన్‌ పాలనలో విధ్వంసం జరిగిందని చెబుతున్న చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలని రాకపోతే లోకేశ్‌ను పంపాలని సవాల్ విసిరారు.

Also read: తెలంగాణ వ్యాప్తంగా ‘జిల్లా దశాబ్ది’ సంబరాలు.. కేటీఆర్ కీలక పిలుపు!

Tags

Related News

ఎన్నికలంటే వైసీపీకి వణకు.. అందుకే న్యాయస్థానాలకు, పార్టీ పరంగా బీసీలకు న్యాయం-సీఎం చంద్రబాబు

బీసీల రిజర్వేషన్ల అంశం.. ఏపీ ప్రభుత్వం రియాక్ట్, పార్టీ పరంగా ఇస్తామన్న మంత్రి పార్థసారధి

కూటమి ప్రభుత్వం, వైసీపీకి షాక్.. 34శాతం బీసీ రిజర్వేషన్లు అంశం, పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

ఏపీలో రేషన్ కార్డు దారులకు అలర్ట్.. లింక్ చేయకుంటే కార్డు కట్, ఇంకెందుకు ఆలస్యం

దాదాపు రెండు గంటలపాటు భేటీ.. ఒత్తిడిలో పెద్దాయన, బాబు ఏం చెప్పారు?

దసరా వేళ ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. పట్టణాలకు ఆ విధంగా, గ్రామాలకు మరొకలా..

ఆపరేషన్ ఫైర్‌వాల్.. విశాఖ నేవీపై పాకిస్తాన్ హనీ ట్రాప్ వల!

Big Stories

Advertisement
×