E-Paper
Advertisement

ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించిన విజయ్ దేవరకొండ… వాటిని తొలగించాలంటూ!

ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించిన విజయ్ దేవరకొండ… వాటిని తొలగించాలంటూ!
Advertisement

Vijay Devarakonda: టాలీవుడ్ సినీ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో AI టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఎంతోమంది సెలెబ్రెటీల అనుమతి లేకుండా వారి ఫోటోలు వీడియోలు అలాగే వారి వాయిస్ కూడా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా తమ అనుమతి లేకుండా తమ ఫోటోలను వాడుకుంటున్న నేపథ్యంలో సెలబ్రిటీలు ఈ విషయంపై కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ సైతం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

తన గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారు..

విజయ్ దేవరకొండ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఇందులో భాగంగా తన అనుమతి లేకుండా తన గుర్తింపును చాలామంది దుర్వినియోగం చేస్తూ ఏఐ ద్వారా అసభ్యకరమైన కంటెంట్ క్రియేట్ చేస్తున్నారని తెలిపారు అదేవిధంగా తప్పుడు ప్రచారాలతో కూడిన నకిలీ ఎండార్స్మెంట్లో గూగుల్ ప్లే స్టోర్లోని యాప్స్ అలాగే తన పేరుతో విక్రయిస్తున్న టీషర్ట్స్, ముగ్గులు వంటి ఉత్పత్తులను వెంటనే తొలగించాలని ఈయన పిటిషన్ లో కోరారు.

అనుమతి లేకుండా ఉపయోగించకూడదు..

Advertisement

ఈ విధంగా విజయ్ దేవరకొండ తన అనుమతి లేకుండా తన పేరును ఫోటోలను ఉపయోగించకూడదని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ వికాస్ మహాజన్ క్లుప్తంగా విచారించారు. మధ్యంతర ఉత్తర్వుల కోసం దేవరకొండ దాఖలు చేసిన దరఖాస్తుపై కోర్టు ఉత్తర్వు జారీ చేస్తుందని ఆయన తెలిపారు. కొంతమంది వ్యక్తులు.. విజయ్ దేవరకొండ ఏజెంట్లుగా నటిస్తూ చేస్తున్న నకిలీ ప్రచారాలకు సంబంధించి ఆయన చిత్రాలు, ఇతర వ్యక్తిత్వ లక్షణాలతో కూడిన వస్తువుల ద్వారా దేవరకొండ గుర్తింపును వాణిజ్యపరంగా దుర్వినియోగం చేస్తున్నారని కూడా న్యాయవాది కోర్టుకు తెలిపారు.

రణబాలి ప్రమోషన్లలో దేవరకొండ..

ఈ విధంగా విజయ్ దేవరకొండ కోర్టును ఆశ్రయించడంతో కొన్ని వెబ్సైట్స్ ఇప్పటికే కొన్ని లింక్స్ తొలగించారని కూడా తెలిపారు. విజయ్ దేవరకొండ దాఖలు చేసిన ఈ పిటీషన్ విషయంలో కోర్టు ఎలాంటి ఉత్తర్వులను జారీ చేస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు ఫోటోలు వీడియోలపై కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ కూడా కోర్టును ఆశ్రయించారు. ఇక విజయ్ దేవరకొండ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన రణబాలి సినిమా(Ranabaali Movie) ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా, పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా, ఈ ట్రైలర్ వీడియో కి చాలా మంచి ఆదరణ లభించింది. పెళ్లి తర్వాత విజయ్ ,రష్మిక జంటగా ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

Advertisement

Also Read: భయపడితే ముందుకు వెళ్లలేం… కత్రినా కైఫ్ కామెంట్స్ వైరల్!

Related News

సుమలతకి అనుకూలంగా హైకోర్టు.. అసోసియేషన్ ఎన్నికలకు బ్రేక్!

భయపడితే ముందుకు వెళ్లలేం… కత్రినా కైఫ్ కామెంట్స్ వైరల్!

మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన మమితా బైజు.. ‘జై హనుమాన్’లో కీ రోల్!

‘కామ్రెడ్ కళ్యాణ్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. శ్రీవిష్ణు హిట్ కొట్టాడా..?

నానా పటేకర్ ఒక దుష్టుడు.. బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్, తిట్టి పోస్తున్న జనం!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ ట్రైలర్ రిలీజ్!

‘ రామాయణ’ చిత్ర నిర్మాత ఆఫీసులపై ఐటీ దాడులు!

Big Stories

Advertisement
×