BigTV English

AP Land Survey : ఏపీలో భూముల రీ సర్వే మొదలు.. ఏ భూములు కొలుస్తారు.? ఏం ప్రయోజనం అంటే.?

AP Land Survey : ఏపీలో భూముల రీ సర్వే మొదలు.. ఏ భూములు కొలుస్తారు.? ఏం ప్రయోజనం అంటే.?

AP Land Survey : ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా మారిన భూముల రీ సర్వే వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. రాష్ట్రంలో ఎన్నో దశాబ్దాల క్రితం నిర్వహించిన సర్వేను పూర్తిగా ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పం. అందుకు అనుగుణంగానే.. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రీ సర్వేను చేపట్టింది.


సరిగా ఎన్నికలకు కొద్ది నెలల ముందుగానే రీసర్వేను చేపట్టడం, దానితో పాటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమలు చేసేందుకు ప్రయత్నించి.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఈ రెండు విషయాల గురించే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన కూటమి నేతలు.. ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేశారు. ఇప్పుడు.. మరోమారు భూముల రీసర్వేకు రంగం సిద్ధం చేస్తుండడంతో.. అంతటా ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

మొదటిగా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలను ఒక్కసారే కాకుండా.. తొలుత మండలానికి ఒక్క గ్రామాన్నే ఎంపిక చేయనున్నారు. ఆ గ్రామంలో జనవరి 10 నుంచి భూముల సర్వే మొదలు కానుంది. తొలుత ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చనున్న సర్కార్.. ఈనెల 20 నుంచి ప్రైవేట్, వ్యవసాయ భూముల సర్వే నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అక్కడ ఫలితాల్ని బట్టి.. ఏమైనా మార్పు చేర్పులు ఉంటే చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత మండలాల్లోని మిగతా గ్రామాల్లోనూ భూముల రీ సర్వే చేపట్టనున్నారు. ఈ మొత్తం ప్రక్రియకు నాలుగు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు.


గత ప్రభుత్వానికి ఎదురైన అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని.. జాగ్రత్తగా వ్యవహరించాలని సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న సర్వేపై అన్ని విషయాలు రైతులకు వివరించిన తర్వాతనే వారి ఆమోదంతో రీ సర్వే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యచరణ రూపొందించి, అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతంలో వైసీపీ ప్రభుత్వం.. రీ సర్వే పై ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడంతో.. ఆ ప్రభావం ఎన్నికల్లో పడిందని ప్రభుత్వలోని కీలక నేతలు సైతం ఆలోచిస్తున్నారు. పైగా.. అప్పడు హడావిడిగా చేపట్టిన రీ సర్వేలో తప్పులు దొర్లడం, సరిహద్దు రాళ్లను మార్చిన నేపథ్యంలో… సమస్యలు ఉత్పన్నం అయినట్లు గుర్తించారు. అందుకే.. ఈ సారి.. కేవలం గ్రామ కంఠం దగ్గరి ప్రధాన రాళ్లను మాత్రమే మార్చనుండగా, రైతులు సరిహద్దు రాళ్ల మార్పు చేర్పులపై ఎలాంటి ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 16,816 రెవెన్యూ గ్రామాల్లో.. 6,688 గ్రామాల్లో అంటే 40% గ్రామాల్లో భూముల రీ సర్వే గతంలోనే పూర్తయ్యింది. అవి మినహా మిగతా గ్రామాల్లో సర్వే చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అధికారులు 200 నుంచి 250 ఎకరాలను ఒక బ్లాక్‌గా విభజించి సర్వే నిర్వహించనుండగా, గ్రామ అవసరాల్ని బట్టి మూడు, నాలుగు సర్వే బృందాల్ని ఏర్పాటు చేయనున్నారు.

Also Read : ఏపీ సర్కార్ షాకింగ్ న్యూస్.. ఇకపై వారికి పింఛను కట్..

ప్రతి గ్రామంలో ఇద్దరు సర్వేయర్లు, ఒక వీఆర్వో, ఒక వీఆర్‌ఏ సభ్యులుగా ఉండనుండగా, సర్వే చేసేందుకు ముందుగానే.. సంబంధింత రైతులకు సమాచారం అందించనున్నారు. రైతులు అంతా అందుబాటులో ఉన్నప్పుడు, వారికి అనువైన సమయాల్లోనే సర్వే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. లేదంటే.. భవిష్యత్త్ లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు.

Related News

iPhone Unit: కుప్పం మహార్థశ.. ఐఫోన్ ఛాసిస్ తయారీ, ముందుకొచ్చిన ఆ కంపెనీ

AP Politics: సినిమాలకు గుడ్ భై..! పవన్ ప్లాన్ ఇదేనా..?

Heavy Rains: రాష్ట్రంలో కుమ్మేస్తున్న వర్షం.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్!

AP rainfall alert: ఏపీలో మళ్లీ వానల దాడి.. తీర ప్రాంతాలకి అలర్ట్!

Indrakiladri temple: విజయవాడ దుర్గమ్మ భక్తులకు షాక్.. కొత్త రూల్ పాటించాల్సిందే!

AP Heavy Rains: ఏపీకి భారీ వర్షసూచన.. గణేష్ మండపాల కమిటీ సభ్యులకు కీలక ప్రకటన జారీ!

Big Stories

×