AP Liquor Shops: ఏపీలో ఇకపై అలా చేస్తే చుక్కలేనంటూ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అది కూడా మందుబాబుల్లో ఫుల్ జోష్ పెంచే న్యూస్ అని చెప్పవచ్చు. ఇక ఎక్కడైనా అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగితే.. ఆ షాపు యజమానులపై కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇది ఇలా ఉంటే మద్యం వ్యాపారుల వాదన మాత్రం వేరేవిధంగా ఉంది.
ఎన్నికల సమయంలో మందుబాబులకు కూటమి వరాలు కురిపించింది. తక్కువ ధరకు మద్యాన్ని అందిస్తామని, బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు అధికారంలోకి రాగానే, సీఎం చంద్రబాబు నూతన మద్యం విధానంను ప్రవేశపెట్టారు. లాటరీ పద్దతిన మద్యం షాపు లీజుదారులను సైతం నియమించగా, ప్రభుత్వానికి ఈ పద్దతి ద్వారా ఆదాయం కూడా కోట్లల్లో వచ్చింది. మందుబాబులు మాత్రం ఫుల్ జోష్ గా ప్రభుత్వం మద్యంపై అవలంబిస్తున్న తీరు పట్ల ఫుల్ జోష్ లో ఉన్నారు. కానీ కొద్దిరోజులకే మద్యం వ్యాపారులు మాత్రం తమకు నష్టాలు వస్తున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారు.
ఇందుకు వారి వాదన ఏమిటంటే.. తమకు ప్రతి మద్యం సీసాపై కమిషన్ పెంచకపోతే లైసెన్స్ ఫీజు కట్టలేం అంటున్నారు మద్యం షాపుల యజమానులు. మద్యం షాపుల టెండర్ కు ముందు ప్రభుత్వం ప్రకటించిన 20 శాతం కమిషన్ ఇస్తే తప్ప, షాపులు నడపలేమంటూ స్పష్టం చేశారు.. రెండు నెలలకు కట్టాల్సిన ఫీజులు ముందుగానే కట్టించుకుంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం షాపులకు ఇస్తున్న కమిషన్ ను వెంటనే పెంచాలంటూ ఇటీవల నిర్వహించిన మద్యం షాపులు, బార్ షాపుల యజమానుల సమావేశంలో పాల్గొన్న యజమానులు డిమాండ్ చేశారు. టెండర్ సమయంలో ప్రభుత్వం ఇస్తామన్న కమిషన్ ఇవ్వాలంటూ ఏకగ్రీవంగా వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Kakinada PDS Rice Sumggling: కాకినాడ పోర్టు చుట్టూ ఏపీ-తెలంగాణ రాజకీయాలు.. మరో కీలక పరిణామం
ఇలా వీరు డిమాండ్ చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం సీరియస్ యాక్షన్ కు దిగింది. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు లిక్కర్ అమ్మే షాపులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడుతూ తొలిసారి దొరికితే ఏకంగా రూ.5 లక్షలు జరిమానా విధించనున్నట్లు సమాచారం. అయినా తీరు మారకుండా రెండోసారి కూడా అదే జరిగితే సదరు బార్ లేదా లిక్కర్ షాపు లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అటు మందుబాబులు, ఇటు ప్రభుత్వం మధ్యలో తాము నలిగిపోతున్నామని మద్యం వ్యాపారులు తెలుపుతున్నారు.