E-Paper
Advertisement

బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీ-ఒడిషా భారీ వర్షాలు, తెలంగాణలో కూడా

బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీ-ఒడిషా భారీ వర్షాలు, తెలంగాణలో కూడా
Advertisement

Rain Alert In AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరం వైపు దూసుకొస్తోంది. దీనికారణంగా ఏపీ-తెలంగాణ, ఒడిషాల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీ-ఒడిషా వైపు కదులుతోంది

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. బుధవారం రాత్రి లేదా గురువారం తెల్లవారుజామున వాయుగుండం విశాఖపట్నం- గోపాల్‌పూర్ మధ్య ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాయుగుండం కారణంగా కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితిలో సముద్రం తీవ్ర అలజడిగా ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. వాయుగుండం నేపథ్యంలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని, ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు.

నాలుగురోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం

Advertisement

తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం అనగా నేడు అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. మిగతా కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. బుధవారం రోజు కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటుగా యానాంలకు రెడ్ అలర్ట్‌ జారీ చేసింది. అటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గురువారం కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, యానాం ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలో వాతావరణ పరిస్థితి ఏంటి?

బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో చల్లటి గాలులు వీస్తున్నాయి. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం వేళ వాతావరణం పొడి ఉంటుంది, ఎండ తీవ్రత కాస్త కనిపించినప్పటికీ మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో ఆకస్మికంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది. వాన కబురు నేపథ్యంలో సాయంత్రం వేళ వాహనదారులు, రోడ్లపై వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించింది.

Advertisement

ALSO READ: డీసీసీబీ స్కామ్‌పై పవన్ కళ్యాణ్‌కు లేఖ.. సీబీఐ విచారణకు వైసీపీ డిమాండ్!

Related News

విజయవాడ శాప్ ఆఫీస్ ఘటన.. చంద్రబాబు ప్రభుత్వం సీరియస్, ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

డీసీసీబీ స్కామ్‌పై పవన్ కళ్యాణ్‌కు లేఖ.. సీబీఐ విచారణకు వైసీపీ డిమాండ్!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. హోంమంత్రి అనిత హెచ్చరికలు జారీ!

టీచర్లపై దాడి చేస్తే ఊరుకునేది లేదు.. వైసీపీకి మంత్రి నారా లోకేష్ వార్నింగ్

190 ఎకరాల భూ కబ్జా.. ఆధారాలు ఉన్నాయి.. తాడిపత్రిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసుల దాడిలోనే మరణించాడని సిట్ నిర్ధారణ!

దమ్ముంటే అసెంబ్లీకి రండి.. మీ బట్టలూడదీసే ధైర్యం మాకుంది, వైసీపీకి సీఎం చంద్రబాబు వార్నింగ్

Big Stories

Advertisement
×