DCCB Scam: కాకినాడ జిల్లా డీసీసీబీ బ్యాంకులో జరిగిన అక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు పెద్దాపురం వైసీపీ ఇంచార్జ్ దవులూరి దొరబాబు బహిరంగ లేఖ రాశారు. డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) పై చర్యలు తీసుకోవాలని దొరబాబు కోరారు.
డీసీసీబీ బ్యాంకులో జరిగిన భారీ కుంభకోణాలు, వేతనాల పెంపు పేరిట జరిగిన నగదు వసూళ్ల వ్యహరంపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిష్పక్షపాతంగా విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అపెక్స్ బ్యాంకులైన నాబార్డు, ఆప్కోబ్ స్పష్టమైన అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ నిబంధనలకు విరుద్ధమైన వేతనాల పెంపు వల్ల బ్యాంకుపై నెలకు 75 లక్షలు అదనపు భారం పడిందని తెలిపారు. బ్యాంకు పరిదిలోని 52 శాఖలలో 320 మంది ఉద్యోగులకు సంబందించి పెంచిన వేతనాల మొత్తాన్ని ఒకేసారి నగదు రూపంలో ఎందుకు వసూలు చేశారు? ఎవరి ఆదేశాలతో ఉద్యోగుల నుంచి బలవంతంగా సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాలు తీసుకున్నారు అని అన్నారు.
Also read: బడ్జెట్ ధరలో ఊరమాస్ సౌండ్! జెబ్రానిక్స్ స్పీకర్‌పై సూపర్ డీల్!
బ్యాంకు 52 శాఖలకు సంబందించిన సీసీటీవీ ఫుటేజ్, ఒకే రోజు ఉద్యోగుల ఖాతాల నుండి జరిగిన నగదు లావాదేవీల రికార్డులు, ఉద్యోగుల సెల్ప్ డిక్లరేషన్, నాబార్డు, ఆప్కాబ్ హెచ్చరిస్తూ రాసిన అధికారిక లేఖలను తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. డీసీసీబీ బ్యాంకులో జరిగిన ఈ అక్రమాలు, కుంభ కోణాలపై సిట్, లేదా సీబీఐ విచారణకు సిపార్సులు చేసి మీ ప్రభుత్వ పారదర్శకతను, జవాబుదారీతన్నాన్ని నిరూపించుకొవాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.
Also read: సీఎం రేవంత్ రెడ్డికి.. కేటీఆర్ ఛాలెంజ్..?