East Godavari Encounter: మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బలు తగులతున్నాయి. ఛత్తీడ్‌గడ్‌లో వరుసగా ఎదురుదెబ్బలు తగడంతో మిగతా నేతలు చెల్లాచెదురయ్యారు. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో బుధవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కీలక నేతలు హతమయ్యారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి అడవుల్లో బుధవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు-బలగాలకు మధ్య జరిగిన కాల్పులు చోటు చేసుకున్నారు.
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు ఊహించని దెబ్బ తగిలింది. తెలంగాణకు చెందిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ మృతి చెందారు. వీరితోపాటు మరో మావోయిస్టు హతమైనట్లు తెలుస్తోంది. మావోల నుంచి కాల్పులు ఆగడంతో కోయిలగూడెం, కిట్టుకూరు గ్రామాల అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.
ఘటనా స్థలం పలువురు మావోయిస్టులు పరారయ్యారైనట్టు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో భారీగా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారంతో మారేడుమిల్లి అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు ఎన్ కౌంటర్‌లో మృతి చెందిన గణేష్, అరుణలపై రివార్డులు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి మూడు ఏకే 47 రైఫిల్స్‌ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ALSO READ: కుప్పం మహిళ ఘటనలో నలుగురు అరెస్టు
ఇటీవల మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య అరుణగా చెబుతున్నాయి బలగాలు. ఆమె సొంతూరు విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలం కరకవాణిపాలెం గ్రామానికి చెందిన మహిళ. ఈమెపై 20 లక్షల రివార్డు ఉంది. 2018 ఏడాది విశాఖ ఏజెన్సీలోని దుంబ్రిగూడ సమీపంలో అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోము హత్య కేసులో నిందితురాలిగా ఉంది.
జనవరిలో ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి మరణించారు. గతంలో సీఎం చంద్రబాబుపై అలిపిరి వద్ద జరిగిన దాడి కేసులో ఈయన కీలక సూత్రధారి. ఆయన సొంతూరు చిత్తూరు జిల్లా. అయితే బుధవారం జరిగిన కాల్పుల్లో చలపతి భార్య అరుణ మృతి చెందింది.
సెంట్రల్ కమిటీ సభ్యుడు రవి అలియాస్ గణేష్ సొంతూరు వరంగల్ జిల్లాలోని వెలిశాలి గ్రామం. ఇతడిపై 25 లక్షల రివార్డు ఉంది. మరో మావోయిస్టు అంజు ఉన్నట్లు చెబుతున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య భారీగా ఉండేది. ఇటీవలకాలంలో కీలక నేతలు ఎదురుకాల్పుల్లో మృతి చెందడం, మరికొందరు లొంగిపోవడంతో క్రమంగా ఆ సంఖ్య తగ్గిపోతోంది.
రెండు దశాబ్దాల కిందట ఆ కమిటీలో 42 మంది సభ్యులు ఉండేవారు. ఈ ఏడాదిలో నలుగురు మృతి చెందారు. ప్రస్తుతం 16 మందిలో 11 మంది తెలుగువారు ఉన్నారు. మరోవైపు కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపికపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.
రెండు దశాబ్దాల ప్రస్థానంలో మావోయిస్టు పార్టీ మధ్య భారతంలో జన తన సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నడిపింది. అబూజ్‌మడ్ ప్రాంతాన్ని కంచుకోటగా చేసుకుని నాయకులను, క్యాడర్‌ను కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రాంతం బలగాల వశమైన విషయం తెల్సిందే.
మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్ కౌంటర్..
ఎదురుకాల్పుల్లో తెలంగాణకు చెందిన సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ మృతి
3 ఏకే-47 రైఫిల్స్ స్వాధీనం pic.twitter.com/6nbADgOAMF
— BIG TV Breaking News (@bigtvtelugu) June 18, 2025