IND vs Aus 3rd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో ( Border-Gavaskar Trophy 2024/25 ) భాగంగా… ప్రస్తుతం ఆస్ట్రేలియా ( Australia) వర్సెస్ ఇండియా ( Team India) మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు టెస్టులు పూర్తికాగా ప్రస్తుతం మూడవ టెస్ట్ జరుగుతోంది. బ్రిస్బెన్ లోని గబ్బా ( Cricket Ground in Brisbane, Gabba)వేదికగా… ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మూడో టెస్ట్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లో… మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు… టీమిండియా పై ( Team India) ఆదిపత్యం చెలాయించింది.
Also Read: Sanjiv Goenka: ఢిల్లీ కుట్రలు… పంత్ కు ఎక్కువ ధర పెట్టెలా చేశారు.. భారీ నష్టాల్లో ?
ఆస్ట్రేలియా బ్యాటర్లందరూ విజృంభించి ఆడారు. దీంతో… భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా. మొదటిరోజు.. పది ఓవర్లు పూర్తికాగానే వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మొదటి రోజు పూర్తిగా ఆట రద్దయింది. ఇక నిన్న రెండవ రోజు…. ఆస్ట్రేలియా బ్యాటర్లు… విజృంభించి ఆడారు. ఈ తరుణంలోనే… ఆస్ట్రేలియా ఏకంగా 117 ఓవర్లు ఆడింది. దాంతో 445 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఆస్ట్రేలియా బ్యాటర్లు… ట్రావిస్ హెడ్ ( Travis Head ), స్టీవెన్ స్మిత్ ( Steven Smith) ఇద్దరు అద్భుతమైన సెంచరీలతో రాణించారు. ఇద్దరు బ్యాటర్లు అవుట్ అయినప్పటికీ అలెక్స్ క్యారే వికెట్ కీపర్… 88 బంధువులు 70 పరుగులు చేసి… జట్టును ఆదుకున్నాడు. అటు ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కూడా అద్భుతంగా రాణించాడు. దీంతో మూడవరోజు ఉదయం ఆట ప్రారంభం కాగానే… వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఆల్ అవుట్ అయింది. దీంతో టీమిండియా ముందు మొదటి ఇన్నింగ్స్ లో 446 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది ఆస్ట్రేలియా ( Australia).
Also Read: WPL Auction 2025: జాక్‌పాట్ కొట్టిన 16 ఏళ్ల అమ్మాయి…రికార్డు సృష్టించిన విండీస్ ప్లేయర్!!
అయితే ఆస్ట్రేలియా బ్యాటింగ్ పూర్తికాగానే…మ్యాచ్ కు మరోసారి వరుణుడు అడ్డంకి గా మారాడు. దీంతో టీమిండియా ( Team India) బ్యాటింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే మొదటి వికెట్ కూడా కోల్పోయింది టీమిండియా. ఓపెనర్ యశస్వి జైస్వాల్…. రెండు బంతులు ఆడి ఒక ఫోర్ కొట్టి అవుట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో మార్ష్కు క్యాచ్ ఇవ్వడంతో… యశస్వి జైస్వాల్ పెవిలియన్ కు వెళ్లాడు. దీంతో ప్రస్తుతం కేఎల్ రాహుల్, అలాగే శుభమన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్నారు.
ఇక అంతకు ముందు టీమిండియా బౌలర్ల ప్రదర్శన చూస్తే… టీమిండియా ఫాస్ట్ బౌలర్ వైస్ కెప్టెన్ బుమ్రాకు 6 వికెట్లు పడ్డాయి. అలాగే మహమ్మద్ సిరాజుకు రెండు వికెట్లు పడడం జరిగింది.నితీష్ కుమార్ రెడ్డికి ఒకటి, అటు ఆకాష్ దీప్ అనే బౌలర్ కు ఒక వికెట్ పడింది. మొత్తం సీమర్లకే వికెట్లు పడ్డాయి. రవీంద్ర జడేజాను ఉతికి ఆరేశారు ఆస్ట్రేలియా బ్యాటర్లు. ఆల్ రౌండర్ కోటలో వచ్చిన రవీంద్ర జడేజా బౌలింగ్ లో…ఒక వికెట్ కూడా పడలేదు.వాస్తవానికి ఈ స్టేడియం పూర్తిగా ఫాస్ట్ బౌలర్లకు మాత్రమే అనుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే.