E-Paper
Advertisement

ఓరి దేవుడా.. రూ.169 కే 90 రోజుల వ్యాలిడిటీనా.. ఇది పక్కా సామాన్యుల ప్లాన్!

ఓరి దేవుడా.. రూ.169 కే 90 రోజుల వ్యాలిడిటీనా.. ఇది పక్కా సామాన్యుల ప్లాన్!
Advertisement

Vi Recharge: ప్రభుత్వ రంగాని చెందిన బీఎస్‌ఎన్‌ఎల్ తక్కువ ధరల్లో రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తుండటంతో.. ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా తమ కస్టమర్లను కాపాడుకునేందుకు కొత్త కొత్త బడ్జెట్ రీఛార్జ్ ఆప్షన్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vi) తన వినియోగదారుల కోసం ఒక సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునే వారికి రూ. 169 ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ వల్ల యూజర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

రూ. 169 ప్లాన్ వివరాలు..

సెకండరీగా వాడుతున్న సిమ్ ను ఎక్కువ రోజులు యాక్టివ్ గా ఉంచుకోవాలని భావించే వారి కోసం వీఐ ఈ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు ఏకంగా 90 రోజుల పాటు సుదీర్ఘమైన వ్యాలిడిటీ లభించనుంది. ఇందులో ప్లాన్ మొత్తం కాలానికి 8 జీబీ హై-స్పీడ్ డేటాను ఆఫర్ చేస్తున్నారు. డేటా పరిమితి పూర్తయిన తర్వాత డేటా వినియోగానికి అదనపు ఛార్జీలు వర్తించనున్నాయి.

ఫ్రీ కాల్స్ సంగతేంటి?

Advertisement

రూ.169 ప్లాన్ లో ఫ్రీ కాల్స్ ను అందుబాటులో లేవు. వినియోగదారులు కాల్స్ మాట్లాడటానికి, ఎస్‌ఎం‌ఎస్‌లు పంపడానికి వీఐ టాక్‌టైమ్ ప్లాన్ ను ప్రత్యేకంగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవుతుంది. ఈ ప్లాన్ కేవలం సిమ్ కార్డ్ వ్యాలిడిటీ పెంచుకోవడానికి.. ఇన్‌కమింగ్ కాల్స్ పొందడానికి, అవసరమైనప్పుడు డేటా వాడుకోవడానికి అనుకూలంగా ఉండనుంది.

Also Read: Airtel మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. రూ.489 కే 77 రోజుల వ్యాలిడిటీ.. నాన్ స్టాప్ కాల్స్, డేటా!

ఈ ప్లాన్ తో ఎవరికి ప్రయోజనకరం?

Advertisement

ప్రస్తుత రోజుల్లో రెండు సిమ్ కార్డులు ఉపయోగిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మెయిన్ సిమ్‌లో అపరిమిత ప్లాన్‌లు వేసుకున్నప్పటికీ.. రెండో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ప్రతినెల భారీ మొత్తంలో రీఛార్జ్ చేయడం కొందరికీ భారంగా మారుతోంది. అలాంటి వారికి రూ. 169 తో 90 రోజుల పాటు సిమ్ యాక్టివ్‌గా ఉండటం పెద్ద ఊరటే అని చెప్పాలి. తక్కువ ఖర్చులో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునే సాధారణ వినియోగదారులకు వీఐ తీసుకొచ్చిన ఈ ప్లాన్ పర్ఫెక్ట్.

Also Read: BSNL మరో సంచలనం.. రూ. 897 కే 6 నెలల వ్యాలిడిటీ.. ఈ ప్లాన్‌ ఎంత బాగుందో..!

Tags

Related News

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే..99 % మందికి తెలియని విషయాలు!

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

Big Stories

Advertisement
×