Chiranjeevi – Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి రూటు మార్చారా? రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారా? బీజేపీ నుంచి ఇండికేషన్స్ ఉన్నాయా? పనిలో పనిగా టీడీపీ నుంచి రూట్ క్లియర్ చేసుకునే పనిలో పడ్డారా? మంత్రి లోకేష్‌కు తొలిసారి బర్త్ డే విషెస్ చెప్పడం వెనుక కారణమేంటి? ఇదే ప్రశ్నలు రాజకీయ, సినీ అభిమానులను వెంటాడుతున్నాయి.
మంత్రి నారా లోకేష్ గురువారం 42వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు. వారిలో రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఉన్నారు. ఇక టీడీపీ అభిమానులు ఫుల్‌ఖుషీగా ఉన్నారు. సోషల్ మీడియా అంతా బర్త్ డే విషెస్ హంగమా.
మంత్రి లోకేష్‌కు విషెస్ చెప్పినవారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ఏపీ అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో విజయం సాధించాలని కోరారు. ముందుకు అద్భుతమైన సంవత్సరం ఉందని రాసుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. చిరంజీవి ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పడంపై అసలేం జరుగుతోందన్న చర్చ అప్పుడే మొదలైపోయింది.
కొందరి ప్రముఖులకు మాత్రమే మెగాస్టార్ శుభాకాంక్షలు చెప్పిన సందర్భాలున్నాయి. తొలిసారి లోకేష్‌కు చెప్పారని అంటున్నారు. దీనివెనుక ఏమైనా ఉందా అంటూ చిన్నపాటి చర్చ కొనసాగుతోంది. ఒక్కసారి వెనక్కి వెళ్దాం..
ALSO READ: సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఆ వార్తలకు ఫుల్‌స్టాప్
కొద్దిరోజులుగా మెగాస్టార్ గురించి రకరకాల వార్తలు హంగమా చేస్తున్నాయి. ఆయన మోదీ కేబినెట్‌లోకి వెళ్లే అవకాశముందని సినీ, రాజకీయ వర్గాల్లో ఓ వర్గం బలంగా చెబుతోంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి చిరంజీవిని రంగంలోకి దించాలన్నది దాని సారాంశం. అందుకే ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఏ సందర్భం వచ్చినా కమలనాథులు చిరంజీవికి ప్రయార్టీ ఇస్తున్నారని అంటున్నారు.
ఈ విషయంలో చిరంజీవికి బీజేపీ నుంచి రూట్ క్లియర్ అయ్యింది. ఇక మిగిలింది టీడీపీ నుంచి మాత్రమే. అందుకే మంత్రి లోకేష్‌కు విషెస్ చెప్పారన్నది ప్రత్యర్థుల నుంచి వస్తున్న కామెంట్లు. తెలంగాణలో బీజేపీ-జనసేన నుంచి బరిలోకి దిగినా ఫలితం ఉండదని, అందుకే టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని వాదన సైతం లేకపోలేదు.
ఎందుకంటే తెలంగాణలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. రేపటి రోజున కూటమిగా ఈ మూడు పార్టీ కలిస్తే తెలంగాణలో తిరుగుండదని మెగాస్టార్ ఆలోచనా? ఈ క్రమంలోనే మంత్రికి విషెస్ చెప్పారన్నది ప్రత్యర్థుల మాట. మొత్తానికి తెరవెనుక ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఎవరికి నచ్చినట్టు వారు రకరకాలుగా కామెంట్లు, స్టోరీలు అల్లేసుకుంటున్నారు.
Wishing you a Very Happy Birthday dear @naralokesh ! Your relentless hard work and passion to serve Telugu people and achieve greater growth for AP are heartening. May you succeed in all your endeavours !! Have a wonderful year ahead! 💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 23, 2025