OTT Movie : ఉత్కంఠభరితమైన ట్విస్ట్‌లు, రియలిస్టిక్ పోలీస్ పోర్ట్రయల్‌తో ఒక మలయాళం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ లేకుండా ఓటీటీలో మాత్రమే విడుదలైంది. ఇది మలయాళం థ్రిల్లర్ ప్రియులకు మస్ట్ వాచ్ మూవీగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం మలయాళం ఇండస్ట్రీలో మానసిక థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రూపొందింది. ఒక సైకో కిల్లర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
అను ఒక ప్రముఖ న్యూస్ చానల్‌లో పని చేస్తుంటుంది. ఆమె ఫిజికల్ ఫిట్‌నెస్ మీద కూడా ఆసక్తి కలిగిన ఉంటుంది. ఆమె రోజువారీ జీవితం ఉత్సాహంగా గడుస్తుంది. కానీ నగరంలో జరుగుతున్న ఒక సీరియల్ మర్డర్ కేసు ఆమె జీవితాన్ని తలకిందులు చేస్తుంది. కథ ప్రారంభంలో, నగరంలో అనేక యువతుల హత్యలు జరుగుతాయి. ఈ హత్యలు అన్నీ ఒకే ప్యాటర్న్‌తో జరుగుతాయి. పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నా పురోగతి కనిపించదు. అను ఈ కేసు గురించి ఒక స్పెషల్ రిపోర్ట్ చేయాలని నిర్ణయించుకుంటుంది. ఆమె పోలీసులతో కాకుండా, స్వయంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతుంది.
ఆమె బాధిత ఫ్యామిలీలతో మాట్లాడి, స్థానికుల నుండి ఇన్ఫర్మేషన్ సేకరిస్తుంది. హత్యలు అన్నీ ఒకే ప్రాంతంలో జరుగుతుండటంతో, కిల్లర్ కూడా ఈ ప్రాంతంలో ఉన్నట్టు అనుమానిస్తుంది. అను ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతుంటే, ఆమెకు బెదిరింపులు వస్తాయి. ఆమె ఫోన్‌లో అనామక కాల్స్ వస్తాయి. ఆమె ఇంటి చుట్టూ అనుమానస్పద సంఘటనలు జరుగుతాయి. పోలీసు ఇన్స్పెక్టర్ అనుకు సహాయం చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ అతను కూడా ఏవో సీక్రెట్స్ దాచిపెడుతున్నాడని ఆమె అనుమానిస్తుంది. క్లైమాక్స్ దగ్గరపడుతుంటే, అను ఒక కీలక ఆధారాన్ని కనుగొంటుంది. కిల్లర్ ఎవరో కాదు ఆమె మాజీ లవర్ రాజీవ్. ఇతను మానసిక సమస్యలతో అనుతో విడిపోయి దూరంగా ఉంటాడు. ఇప్పుడు హత్యలు చేస్తూ, ఆమె దృష్టిని తనపై మల్లేలా చేసుకోవాలాని ప్రయత్నించాడు. ఇది అతని ట్విస్టెడ్ లవ్ స్టోరీ.
అను ఈ వాస్తవాన్ని తెలుసుకుని షాక్ అవుతుంది. ఎందుకంటే ఆమె రోజుల తరబడి అతనితో కలిసి జీవితం గడిపింది. చివరి సీన్‌లో రాజీవ్ అనును కిడ్నాప్ చేసి, ఒక జన సంచారం లేని ప్లేస్‌కు తీసుకెళ్తాడు. ఇక క్లైమాక్స్ ఊహించని మలుపు తిరుగుతుంది. రాజీవ్, అనుని కిడ్నాప్ ఎందుకు చేస్తాడు ? చేసి ఏం చేస్తాడు ? ఆమె కూడా బాదితురాలవుతుందా ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను మాత్రం, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
“ఇన్” అనేది 2022లో విడుదలైన మలయాళం మిస్టరీ-థ్రిల్లర్ చిత్రం. రాజేష్ నాయర్ దర్శకత్వంలో, సలీల్ సంకరన్ నిర్మాణంలో రూపొందింది. ఇందులో డీప్తి సతి (అను, జర్నలిస్ట్), మధుపల్ (విక్రమ్, అను భర్త), మనోహరి జాయ్ (అను తల్లి), కృష్ణన్ బాలకృష్ణన్ (అను తండ్రి) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 45 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 5.5/10 రేటింగ్ పొందింది. ఇది మానోరమమాక్స్ లో 2022 జూలై 7 విడుదలైంది.
Read Also : డబ్బు కోసం అబ్బాయితో ఆ ఆట… ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేసే ఖతర్నాక్ కిలాడీ… ఊహించని క్లైమాక్స్