Lokesh On VSR: విజయసాయిరెడ్డి ‘వ్యవసాయం’పై నోరు విప్పారు మంత్రి నారా లోకేష్. జగన్‌పై తల్లి-చెల్లికి నమ్మకం లేదని, ఇక పార్టీలో నేతలకు ఎలాంటి నమ్మకం ఉంటుందన్నారు. తాము ఈ విషయాన్ని ఎప్పటినుంచో చెబుతున్నామని, డబ్బుల కోసం పార్టీని సైతం అమ్మేస్తారన్నారు. అప్పట్లో తాము చెప్పింది ఇప్పుడిప్పుడే నిజమవు తోందన్నారు. ఆ పార్టీకి ఒకొక్కరు రాజీనామా చేస్తున్నారన్నారని తెలిపారు.
వీఎస్ఆర్‌కు శిక్ష పడదని తానెక్కడ చెప్పలేదన్నారు మంత్రి. పాదయాత్రలో తాను పదేపదే చెప్పానని, తాను ఎవ్వరినీ వదిలేది లేదన్నారు. రెడ్ బుక్ విషయాన్ని మళ్లీ ప్రస్తావించారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులు, నాయకు లను వదిలేది లేదన్నారు. ఈ విషయంలో ఆ పార్టీ నేతలు ఎందుకు భయపడుతున్నారని అన్నారు. భయపడితే చట్టాన్ని ఉల్లంఘించే కదా అని అన్నారు.
కాకినాడ పోర్టుపై ప్రస్తుతం విచారణ జరుగుతోందన్నారు. త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. విచారణ జరుగుతున్న సమయంలో మాట్లాడడం కరెక్టు కాదన్నారు. రూపాయి ఆస్తిని ఆరు పైసలు కొట్టేశారన్నారు. కేసు నమోదు కావడం, ఆపై ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. అవన్నీ త్వరలో బయటకు వస్తున్నాయని తెలిపారు.
సాక్షి పత్రికపై పరువు నష్టం కేసులో సోమవారం విశాఖకు వచ్చారాయన. విచారణను న్యాయస్థానం నాలుగోసారి వాయిదా వేసింది. ఆ తర్వాత మీడియాలో మాట్లాడారు మంత్రి లోకేష్. తాము చేసిన ప్రతీ పనికీ వైసీపీ క్రెడిట్ తీసుకోవడంపై నోరు ఎత్తారు.
ALSO READ: జగన్‌కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్ ఉపసంహరణ, ఆపై
అనంతపురానికి కియా కంపెనీ ఎవరు తీసుకొచ్చారో మీకు తెలుసన్నారు లోకేష్. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పేరిట ఈ-మెయిల్ క్రియేట్ చేశారన్నారు. ఆయన వల్లే ఆ కంపెనీ వచ్చిందని నేతలు చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. టీసీఎస్ విషయంలోనూ అలాంటి క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నం చేశారన్నారు. విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై పై టీడీపీ వెర్షన్ చెప్పారు మంత్రి లోకేష్.