E-Paper
Advertisement

జగన్ అడుగేస్తే విధ్వంసం.. నోరు విప్పితే అబద్ధాలు: మంత్రి సవిత

జగన్ అడుగేస్తే విధ్వంసం.. నోరు విప్పితే అబద్ధాలు: మంత్రి సవిత
Advertisement

Minister Savitha: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ వైఖరిపై రాష్ట్ర మంత్రి సవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారం కోసం వైసీపీ ఏ స్థాయికైనా దిగజారుతోందని మండిపడ్డారు.

సొంత కార్యకర్తలనే పొట్టనబెట్టుకుంటున్న పార్టీ

Advertisement

వైసీపీని ఒక ‘నేరస్తుల ముఠా’ గా మంత్రి సవిత వర్ణించారు. అధికారం సంపాదించడం కోసం ఆ పార్టీ ప్రజల ప్రాణాలతోనే కాకుండా, తమను నమ్ముకున్న సొంత కార్యకర్తల ప్రాణాలతో కూడా ఆడుకుంటోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సమయంలో వైసీపీ కార్యకర్త సింగయ్యను వారి కారుతోనే తొక్కి చంపడం ఆ పార్టీ క్రూరత్వానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

బాధితులను వదిలి… నేరస్తులకు పరామర్శా?

Advertisement

శ్రీకాకుళం జిల్లాలో 44 ఏళ్ల గొర్రెల కాపరి దానయ్య యాదవ్‌ను దారుణంగా బలితీసుకున్నారని సవిత ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన దానయ్య వయస్సు అయిపోయిందంటూ జగన్ బాధ్యతారాహిత్యంగా, హేళనగా మాట్లాడటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ‘జగన్‌కు, వైఎస్ అవినాష్ రెడ్డికి వయస్సు అయిపోలేదా? పదవుల కోసం జగన్‌కు వయస్సుతో పనిలేదా?’ అని నేరుగా నిలదీశారు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి.. నేరాలు చేసిన క్రిమినల్స్‌ను పరామర్శిస్తూ జగన్ అరాచకాలపై ధ్వజమెత్తారు.

Also Read: మళ్లీ వస్తాం.. రూ.80 లక్షలు రెడీగా ఉంచండి!.. లాయర్ ఇంట్లో రూ.3.15 కోట్లు దోచేసి దొంగల వార్నింగ్!

అభివృద్ధి చంద్రబాబు నైజం… విధ్వంసం జగన్ మార్గం

జగన్ అడుగుపెడితే విధ్వంసం.. నోరు విప్పితే అబద్ధాలే వినపడతాయని మంత్రి విమర్శించారు. అశాంతిని రేపుతూ నేరస్తులను వెనకేసుకొస్తున్న వైసీపీని ప్రజలు రాజకీయంగా భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగుతుంటే, జగన్ మాత్రం విధ్వంసకర రాజకీయాలకే పరిమితమయ్యారని స్పష్టం చేశారు.

Tags

Related News

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

Big Stories

Advertisement
×