E-Paper
Advertisement

మీ ఇంటి గోడలే నెట్‌వర్క్ అందిస్తే? జియో Smart Wallతో వైఫై డెడ్ జోన్లకు చెక్!

మీ ఇంటి గోడలే నెట్‌వర్క్ అందిస్తే? జియో Smart Wallతో వైఫై డెడ్ జోన్లకు చెక్!
Advertisement

Jio Smart Wall: సాధారణంగా మనందరి ఇళ్లలో లేదా ఆఫీసుల్లో Wi-Fi సిగ్నల్ అసలు అందని కొన్ని డెడ్ జోన్లు ఉంటాయి. హాలులో ఉన్నంత వేగంగా బెడ్‌రూమ్‌లోనో, బాల్కనీలోనో నెట్ రాకపోవడం మనకు రోజూ ఎదురయ్యే అనుభవమే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రిలయన్స్ జియో ఒక వినూత్న సాంకేతికతను తీసుకొస్తోంది. అదే ‘స్మార్ట్ వాల్’ లేదా ఇంటెలిజెంట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్.

గోడలే సిగ్నల్ పెంచితే?

సాధారణంగా Wi-Fi పరిధిని పెంచడానికి మనం బూస్టర్లు లేదా ఎక్స్‌టెండర్లు వాడుతుంటాం. కానీ జియో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ వాల్ పూర్తి భిన్నమైనది. ఇది ఎలాంటి కొత్త సిగ్నల్స్‌ను ఉత్పత్తి చేయదు. మన ఇంట్లో ఇప్పటికే ఉన్న 5G లేదా Wi-Fi సిగ్నల్స్‌ను అద్దం వెలుగును రిఫ్లెక్ట్ చేసినట్లుగా, సిగ్నల్స్ అందని మూలలకు రీడైరెక్ట్ చేస్తుంది. దీంతో ప్రతి గదిలోనూ అద్భుతమైన నెట్‌వర్క్ లభిస్తుంది.

Advertisement

Also Read: క్వాల్కమ్ ప్రాసెసర్‌తో HP OmniPad 12 వచ్చేసింది.. రూ. 5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఎలా పొందాలంటే?

కనెక్షన్ ఎలా పెరుగుతుందంటే?

ఈ టెక్నాలజీలో ప్రత్యేకమైన ప్యానెల్స్ ఉంటాయి. ఇవి ఇంట్లోని గాలిలో తిరిగే రేడియో సిగ్నల్స్‌ను పట్టుకుని, నెట్‌వర్క్ తక్కువగా ఉన్న వైపు మళ్లిస్తాయి. దీనికోసం ప్రత్యేకంగా పెద్ద పెద్ద టవర్లు లేదా అదనపు డివైజ్‌లను అమర్చాల్సిన అవసరం ఉండదు. గోడలకు అమర్చే చిన్న ప్యానెల్స్ ద్వారానే ఇంట్లోని ప్రతీ మూలకూ నెట్ స్పీడ్ సరి సమానంగా అందుతుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాజిక్:

Advertisement

ఈ స్మార్ట్ వాల్‌ను మరింత ప్రత్యేకంగా మార్చేది దీనిలో ఉండే ఏఐ. సిగ్నల్ ఏ వైపు ఎక్కువగా అవసరమో.. ఎక్కడ నెట్ స్లో అవుతుందో ఇది ఎప్పటికప్పుడు గుర్తిస్తుంది. దానికి తగ్గట్లుగా సిగ్నల్స్ దారిని వాటంతట అవే మార్చుకునేలా AI సహకరిస్తుంది. అంతేకాకుండా.. ఇది కొత్తగా సిగ్నల్‌ను తయారు చేయదు కాబట్టి.. కరెంట్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది.

భవిష్యత్ 6G సాంకేతికత:

భారత్‌లో సొంతంగా 6G సాంకేతికతను అభివృద్ధి చేయాలనే జియో ఆలోచనలో ఈ స్మార్ట్ వాల్ ఒక భాగం. ప్రస్తుతం ఇది ప్రయోగాల దశలోనే ఉన్నప్పటికీ.. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇళ్లలో, ఆఫీసుల్లో డెడ్ జోన్ల సమస్యను తుడిచిపెట్టేసి, మనం ఉండే గోడలనే నెట్‌వర్క్‌లో భాగంగా మార్చే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో ఇంటర్నెట్ వినియోగాన్ని పూర్తిగా మార్చేయనుంది.

Also Read: ఆండ్రాయిడ్ 16, జేబీఎల్ ప్రో సౌండ్‌తో మోటరోలా కొత్త ట్యాబ్లెట్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!

Related News

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే..99 % మందికి తెలియని విషయాలు!

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

Big Stories

Advertisement
×