E-Paper
Advertisement

మళ్లీ వస్తాం.. రూ.80 లక్షలు రెడీగా ఉంచండి!.. లాయర్ ఇంట్లో రూ.3.15 కోట్లు దోచేసి దొంగల వార్నింగ్!

మళ్లీ వస్తాం.. రూ.80 లక్షలు రెడీగా ఉంచండి!.. లాయర్ ఇంట్లో రూ.3.15 కోట్లు దోచేసి దొంగల వార్నింగ్!
Advertisement

Kurukshetra Robbery: హరియాణాలోని కురుక్షేత్రలో భారీ దొంగతనం వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంటిని లక్ష్యంగా చేసుకుని దొంగలు రెండోసారి ఎంట్రీ ఇచ్చారు. అది కూడా కోట్లలో దోపిడీకి పాల్పడటం స్థానికంగా సంచలనం రేపుతోంది.

బాధితులను బంధించి, బెదిరించి..

Advertisement

సీనియర్ న్యాయవాది బల్వంత్ సింగ్ వాలియా ఇంట్లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాత్రి 10 గంటల సమయంలో తుపాకులు, ఆయుధాలతో ఇంట్లోకి నలుగురు దొంగలు చొరబడ్డారు. మొదట ఇంట్లో ఉన్న వాలియా భార్యను తుపాకితో బెదిరించి, కాళ్లూ చేతులు కట్టేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన న్యాయవాదిని కూడా చుట్టుముట్టి బంధించారు. దంపతులిద్దరి పై దాడి చేసి, చంపేస్తామని బెదిరించి బీరువా తాళాలు లాక్కున్నారు.

రూ.3.15 కోట్ల సొత్తు అపహరణ

Advertisement

బీరువాల్లో ఉన్న రూ.3.15 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పాటు న్యాయవాదికి చెందిన లైసెన్స్డ్ రివాల్వర్‌ను కూడా దొంగలు ఎత్తి కెళ్లారు. అంతేకాకుండా, గతంలో ఈ ఏడాది మార్చి నెలలో ఇదే ఇంట్లో జరిగిన రూ.50 లక్షల దొంగతనం కూడా తామే చేశామని దొంగలు చెప్పడంతో న్యాయవాది దంపతులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

మళ్లీ వస్తామని హెచ్చరిక

వెళ్లేముందు దొంగలు సీసీటీవీ కెమెరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. మరో రూ.80 లక్షలు సిద్ధంగా ఉంచుకోవాలని, మళ్లీ వస్తామని హెచ్చరిస్తూ అక్కడి నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: టీడీపీ ఆదేశంతో చలసాని బిగ్ డెసిషన్.. కృష్ణా డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా!

Tags

Related News

ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు.. గిన్నిస్ రికార్డ్ బద్దలుకొట్టిన భారతీయ మహిళ

అమిత్ షా పర్యటన వేళ.. అరుణాచలంలో తీవ్ర కలకలం.. హైదరాబాద్ యువకులు అరెస్ట్!

ఘాట్ రోడ్డులో ఘోరం.. లోయలో పడ్డ బస్సు.. 8 మంది స్పాట్ డెడ్!

మహిళలపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. కౌంటర్‌గా కేంద్ర మంత్రి చురకలు!

ఫోన్‌లో రీల్స్ చూస్తోందని.. భార్యను చంపి, పరుపులో చుట్టి..

సాలరీ రూ.46,000.. ఎస్‌బిఐ జూనియర్ అసోసియేట జాబ్స్.. త్వరగా అప్లై చేసేయండి

జంతర్ మంతర్‌ను మూసివేయండి.. కేంద్రానికి హైకోర్టు కీలక సూచన!

Big Stories

Advertisement
×