Mumbai Hotel: భారతదేశంలో టీ ధరలు భారీగా పెంచుతున్నారు. ముఖ్యంగా మహా నగరాల్లో అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. సాధారణంగా రోడ్ల పక్కన ఉండే టీ స్టాల్స్ ఒక కప్పు టీని రూ. 10 నుంచి రూ.20 వరకు అమ్ముతున్నారు. నీలోఫర్ వంటి ఫేమ్ హోటళ్లలో అయితే టీని రూ.100 నుంచి రూ.150 వరకు కూడా అమ్ముతున్నారు. ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లోని ఫైవ్ స్టార్ హోటళ్లలో రూ.500 వరకు టీ రేట్లు పెడుతున్నారు. ఈ ధరల పెరుగుదల వెనుక హోటళ్ల ఖరీదైన సేవలు, అక్కడ ఉండే లగ్జరీ వాతావరణం, బ్రాండ్ వాల్యూ, పెరిగిన ఉత్పత్తి ఖర్చులు కారణంగా అంత రేట్లు ఉంటాయి. అయితే.. తాజాగా ముంబైలో ఒక ఎన్‌ఆర్‌ఐ ఒక కప్పు టీకి రూ. 1000 బిల్ చూసి ఆశ్చర్యపోయిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అయితే ఈ ధరలు కామన్ పీపుల్ ను ఆందోళన కలిగిస్తోంది. కొందరు ఈ ధరలను విమర్శిస్తుండగా, మరికొందరు లగ్జరీ సేవలకు ఇటువంటి ధరలు సహజమని సమర్థిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
?utm_source=ig_web_copy_link
తెలియక రూ.1000 ఛాయ్ తాగాడు.. ఆ తర్వాత..?
ముంబై నగరం భారతదేశ ఆర్థిక రాజధాని. ముంబై గొప్ప జీవనశైలికి, అలాగే ఖరీదైన హోటళ్లకు ప్రసిద్ధి. అయితే.. ఓ ఎన్ఆర్ఐ తన వ్యక్తిగత పనుల మీద ముంబైకి వచ్చాడు. నగరంలోని ఒక ప్రముఖ హోటల్‌లో అతను ఒక కప్పు టీ ఆర్డర్ చేశాడు. కాసేపటికి టీ వచ్చింది. అతను కాస్త ఆ టీని తాగాడు. తీరా అతని చేతికి బిల్ కూడా వచ్చింది. ఆ బిల్ రిసిప్ట్ లో టీ ధర రూ.1000 ఉండడంతో అతను ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. సాధారణంగా భారతదేశంలో ఒక కప్పు టీ ధర రూ. 10 నుండి రూ. 50 వరకు ఉంటుందని అతను అంచనా వేశాడు. కానీ ఈ హోటల్‌లో ఛాయ్ ధర వెయ్యి రూపాయలు ఉండటంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. చివరకు చేసేదేమీ లేక రూ.1000 బిల్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటన గురించి అతను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ: Leopard Attack: సఫారీ రైడ్‌లో బాలుడిపై చిరుత అటాక్.. పరిగెత్తుకుంటూ వచ్చి మరీ.. వీడియో వైరల్
ఆ టీని బంగారు ఆకులతో తయారు చేశారా..?
ఈ వీడియో కింద నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.. కొందరు ఈ టీ ధరను దారుణంగా విమర్శిస్తున్నారు. మరికొందరు ముంబై వంటి మహానగరంలోని ఫైవ్ స్టార్ హోటళ్లలో ఇలాంటి ధరలు ఉండం మామూలే విషయమే అని సమర్థిస్తున్నారు. ఈ టీ ధరలో హోటల్ ఖరీదైన సేవలు, లగ్జరీ వాతావరణం, బ్రాండ్ విలువ కూడా ఉంటాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు రోడ్డు పక్కన తాగే అల్లం ఛాయ్ మజా ఉంటది.. అది జస్ట్ రూ.10 కే వస్తదని కామెంట్ చేస్తున్నారు. చాలామంది ఈ ధరను ఫన్నీగా తీసుకుని, సోషల్ మీడియాలో హాస్యాస్పదమైన కామెంట్లు చేశారు. ఓ వ్యక్తి అయితే ఈ విధంగా కామెంట్ చేశాడు. ఈ టీ బంగారు ఆకులతో ఏమైనా తయారు చేశారా..? అని కామెంట్ చేసుకొచ్చాడు.
ALSO READ: Vaibhav SuryaVamshi : వైభవ్ సూర్య వంశీపై దారుణంగా ట్రోలింగ్…సంక్రాంతికి వస్తున్నాం బుడ్డోడు అంటూ
కామన్ పీపుల్‌కి ఇది నిజంగా షాకింగే..
అయితే.. ఈ సంఘటన ముంబైలోని ఖరీదైన జీవనశైలిని మరోసారి చర్చకు దారితీసింది. హోటళ్లు తమ సేవలకు ఎక్కువ ధర ఉండడం వెనుక వాటి ఖర్చులు, సౌకర్యాలు, కస్టమర్ ఎక్స్ పీరియన్స్ ఇవన్నీ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ, ఒక కప్పు టీకి రూ. 1000 ధర సామాన్యులకు ఆశ్చర్యకరంగానే ఉంది. ప్రస్తుతం ఈ వైరల్ వీడియో ద్వారా.. భారతదేశంలో జీవన వ్యయం, లగ్జరీ సేవలపై కొత్త చర్చ మొదలైంది.