BigTV English

Monsoon Alert: ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..ఈ జిల్లాలు తస్మాత్ జాగ్రత్త

Monsoon Alert: ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..ఈ జిల్లాలు తస్మాత్ జాగ్రత్త

Monsoon Alert: రానున్న మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారేందుకు అవకాశం ఉందన్నారు. దీంతో ఏపీలో మరో రెండు రోజులు పాటు వర్షాలు కురిస్తాయని సూచించింది. ఈనెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. దీంతో కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెబుతోంది. NTR, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.


చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు 

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో.. మరో నాలుగు రోజులు తెలంగాణకు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో కూడా వాన బీభత్సం సృష్టించింది. రోడ్లన్ని నదులను తలపించాయి. దీంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తం చేసింది.


తెలంగాణలోని కురుస్తున్న భారీ వర్షాలు

గురువారం తెలంగాణలోని పలుజిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పిడుగులు పడి మహబూబాబాద్‌ జిల్లాల్లో ఇద్దరు, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. సూర్యాపేట జిల్లాలో పిడుగుపాటుకు 39 మేకలు చనిపోయాయి. ఇక వీటితో పాటు.. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.

ఖానాపురం మండలాల్లో 20 టన్నులకుపైగా ధాన్యం తడిసిపోయింది

మార్కెట్‌ యార్డులు, కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. రోడ్లపై, కల్లాల్లో ఆరబోసిన దాన్యం వరద నీటిలో కొట్టుకొపోయింది. వరంగల్‌ జిల్లా నర్సంపేట, ఖానాపురం మండలాల్లో 20 టన్నులకుపైగా ధాన్యం తడిసింది. తరలించడానికి సిద్ధంగా ఉన్న బస్తాల్లోకి నీరు చేరింది. వరదలో ధాన్యం కొట్టుకుపోయాయి. లారీల కొరతతో మిల్లులకు ధాన్యం బస్తాలను తరలించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రానున్న మూడురోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, జగిత్యాల, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్ర, శని, ఆదివారాల్లోనూ రాష్ట్రమంతటా వానలు పడతాయని సూచించింది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వర్షాలపై ఎప్పటికప్పుడూ సమీక్షలు జరుపుతూ ప్రజలను అప్రమ్తతం చేయాలని సూచించారు. ప్రధానంగా హైదరాబాద్‌లో రోడ్లపై నీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి, విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

భారీ వర్షాలు కారణంగా సహాయ చర్యల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

తెలంగాణలో ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు సహాయ చర్యల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయి విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక, హైడ్రా బృందాలు ఏర్పాటు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వరదలు సంభవిస్తే తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు. 12 పోలీస్‌ బెటాలియన్లకు చెందిన వంద మంది పోలీసు సిబ్బందితో ఎస్‌ఆర్‌డీఎఫ్‌ బృందాలు ఏర్పాటు చేశారు. వరదలకు సంబంధించి సమాచారం అందిన గంట వ్యవధిలోనే
తమకు కేటాయించిన జిల్లాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read: మళ్లీ కరోనా.. ఆ నెలలోనే భూమి అంతం! వణుకు పుట్టిస్తున్న బాబా వంగా జోస్యం

హైదరాబాద్‌లో అందుబాటులోకి కేంద్ర ప్రభుత్వ 3ఎన్‌ఆర్‌డీఎఫ్‌ బృందాలు ఉన్నాయి. పాత జిల్లా కేంద్రాల్లోని అగ్నిమాపక బృందాలు వరద నివారణకు సిద్ధంగా ఉంటాయన్నారు. జీహెచ్‌ఎంసీ,రంగారెడ్డి జిల్లాలోని నగరపాలక సంస్థలు, పురపాలికల పరిధిలో హైడ్రా బృందాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రమాదకర ప్రాంతాలను అన్ని జిల్లాల కలెక్టర్లు ముందే గుర్తించి చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాల్లో వరదలు, భారీ వర్షాలు సంభవిస్తే ఎస్‌ఆర్‌డీఎఫ్‌కు సమాచారం ఇచ్చి సహాయ చర్యలు చేపట్టాలని.. అగ్నిమాపకశాఖను అప్రమత్తం చేయాలన్నారు.
ఎన్‌ఆర్‌డీఎఫ్‌ బృందాలు, సింగరేణికి చెందిన సహాయ బృందాల సేవలను వినియోగించుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

 

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×