BigTV English

Mudragada : ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఏంటి? హైదరాబాద్‌లో ట్రీట్‌మెంట్, డాక్టర్లు ఏమన్నారు?

Mudragada : ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఏంటి? హైదరాబాద్‌లో ట్రీట్‌మెంట్, డాక్టర్లు ఏమన్నారు?

Mudragada: వైసీపీ నేత, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.


కొన్నాళ్లుగా ప్రోస్టేట్ క్యాన్సర్‌తో ముద్రగడ పద్మనాభం బాధపడుతున్నారు. అయితే శుక్రవారం ఉన్నట్లుండి షుగర్ లెవెల్స్ పడిపోయాయి. ప్రతిపాడు నుంచి తొలుత కాకినాడ తరలించారు. అక్కడి డాక్టర్ల సూచనలతో వెంటనే అంబులెన్సులో హైదరాబాద్ యశోద హాస్పటల్‌కి తరలించారు.

తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన కూతురు క్రాంతి కొద్దిరోజుల ప్రకటన చేశారు.  తండ్రికి సరైన ట్రీట్‌మెంట్ అందించలేదని కుటుంబసభ్యులపై ఆరోపణలు చేశారు. ముద్రగడను ఎవరూ కలవకుండా బంధించారని వ్యాఖ్యానించారు.


ఆయా ఆరోపణలు గడిస్తూ ముద్రగడ పేరు మీద ఓ లేఖ విడుదలైంది. తాను ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నానని, కావాలనే కూతురు కుటుంబసభ్యులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. చివరకు ముద్రగడ కూతురు క్రాంతి చెప్పిన మాటలు నిజమయ్యాయి.

ALSO READ: ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథన్‌రెడ్డి అరెస్ట్

కాపు రిజర్వేషన్ కోసం పోరాడిన వ్యక్తిగా గుర్తింపు సాధించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్ రాజకీయ నేత. అంతేకాదు బలమైన కాపు సామాజిక వర్గానికి ఉద్యమనాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి తీవ్రంగా కృషి చేశారాయన.

వైసీపీ అధికారంలోకి ఎందుకోగానీ ఆయన సైలెంట్ అయిపోయారు. ఆ పార్టీ ఆయనకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. కాకపోతే 2024 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఓడించడానికి ఆయన్ని తీవ్రప్రయత్నాలు చేశారు. తెరవెనుక చేయాల్సినదంతా చేశారు. ఇంత చేసినా వైసీపీ పరాభవం తప్పలేదు.

పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థి ఓడిపోతే ఇంటి పేరు మార్చుకుంటానని శపథం చేశారు. అన్నట్లుగాన పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. గతంలో కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన మంత్రిగా పని చేశారు కూడా. ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×