BigTV English

Municipal Chairperson Election: ఏపీలో హడావిడి.. కార్పొరేషన్లు, మున్సిపాలటీలకు హోరా హోరీగా ఎన్నికలు

Municipal Chairperson Election: ఏపీలో హడావిడి.. కార్పొరేషన్లు, మున్సిపాలటీలకు హోరా హోరీగా ఎన్నికలు

Municipal Chairperson Election: ఏపీలో మరో హై ఓల్టేజ్ హాట్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. కాసేపట్లో రాష్ట్రవ్యాప్తంగా మూడు మున్సిపాలిటీలకు చైర్మన్‌లు, మూడు కార్పొరేషన్‌లకు డిప్యూటీ మేయర్‌లతో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ పదవులకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశాలకు హాజరైన డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియలో పాల్లొననున్నారు. తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లలో ఒక్కో డిప్యూటీ మేయర్, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.


తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లకు ఎన్నికలు, నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు బుచ్చిరెడ్డి పాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు వైస్ చైర్‌పర్సన్ల కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు టీడీపీ, వైసీపీ పార్టీలు ముమ్మరంగా కసర్తతు చేస్తున్నాయి. కార్పొరేటర్లు, కౌన్సిలర్లకి విప్ జారీ చేసింది వైఎస్ఆర్‌సిపి ( YSRCP). కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు డబ్బులిచ్చి, బెదిరించి వారివైపుకు తిప్పుకుంటున్నారంటూ ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో భారీ ప్రలోభాలకు టీడీపీ, వైసీపీ పార్టీలు తెరలేపాయి. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలతో హీటెక్కించారు. ఒక్కొక్క కార్పొరేషన్‌కి మున్సిపాలిటీలకు ప్రత్యేకించి ఇరు పార్టీలు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లను గెలిపించుకునేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయాలు చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయి నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వారిగా ఇంచార్జీగా నియమించింది టీడీపీ హైకమాండ్.


మరోవైపు హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం హిందూపురంలో క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. మంత్రి సవిత ఇలాఖాలో 21 మంది టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో కాసేపట్లో వారిని నేరుగా మున్సిపల్ ఆఫీసుకు తరలించే యత్నం జరుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన వారిలో ఐదురుగురిని వెనక్కి రప్పించే ప్రయత్నం చేసింది వైసీపీ.

Also Read: ఉత్కంఠగా మారిన.. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉపఎన్నిక

హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ విశ్వప్రయత్నాలు చూస్తోంది. వైసీపీకి ఉన్న 30 మంది కౌన్సిలర్లలో 12 మంది టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ టీడీపీ బలం 20కి చేరింది. తాజాగా మరో కౌన్సిలర్ టీడీపీకి మద్దతు తెలిపారు. మరోవైపు పట్టు నిలుపుకునేందుకు వైసీపీ యత్నాలు కొనసాగిస్తోంది. టీడీపీ తరఫున DE రమేశ్, వైసీపీ తరఫున బలరామిరెడ్డి పోటీలో ఉన్నారు. కాసేపట్లో ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది.

 

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×