Yuvraj Singh: భారత క్రికెట్ లో ఇప్పుడు అభిషేక్ శర్మ { Abhishek Sharma} ఓ సంచలనం. భారత్ – ఇంగ్లాండ్ మధ్య 5 టీ-20 ల సిరీస్ {India – England 5 T-20 series} లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన చివరి 5వ టి-20లో అభిషేక్ శర్మ సుడిగాలి సెంచరీ సాయంతో టీమిండియా భారీ స్కోర్ నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగులు చేసింది.
Also Read: Alastair Cook: నా జీవితంలో కొట్టినన్ని సిక్సులు…2 గంటల్లో అభిషేక్ శర్మ కొట్టేశాడు !
టీమిండియా ఇన్నింగ్స్ లో అభిషేక్ శర్మ { Abhishek Sharma} విధ్వంసకర బ్యాటింగ్ ఈ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. శర్మ సిక్సుల వర్షం కురిపించాడు. ఒక్కొక్క బౌలర్ ని లెక్కబెట్టి మరీ కసితో బాదాడు. బౌలర్ చేతిలోనుండి బాల్ రిలీజ్ కావడమే ఆలస్యం.. అది బౌండరీ కి వెళ్లాల్సిందే అన్నట్లుగా ప్రత్యర్థులను ఊచకోత కోశాడు. వాంఖడే స్టేడియాన్ని {wankhede stadium} షేక్ చేశాడు అభిషేక్. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
కేవలం 17 బంతులలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది భారత్ తరపున రెండవ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ గా నిలిచింది. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన అభిషేక్ శర్మ ఫోర్లు, సిక్సర్లు బాధడం ఆపలేదు. 270 స్ట్రైక్ రేట్ తో 37 బంతుల్లోనే సెంచరీ బాదాడు. తన ఇన్నింగ్స్ లో 13 సిక్సర్లు, 7 ఫోర్లతో మొత్తంగా 135 పరుగులు బాదాడు. ఇది అభిషేక్ శర్మ కి రెండవ టి-20 సెంచరీ. అలాగే టి-20 క్రికెట్ లో ఫాస్టెస్ట్ రెండవ సెంచరీగా నిలిచింది.
అంతేకాకుండా ఒక టి-20 ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇక అదే దూకుడుగా ఆడే ప్రయత్నంలో లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ {Adil Rashid} బౌలింగ్ లో మరో సిక్స్ బాదే క్రమంలో జోఫ్రా ఆర్చర్ {jofra Archer} కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిన అభిషేక్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. ఇక బ్యాటింగ్ లోనే కాకుండా అటు బౌలింగ్ లోను అద్భుత ప్రదర్శన చేశాడు. తన బౌలింగ్ లో రెండు వికెట్లు తీసి అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
Also Read: Abhishek Sharma: 37 బంతుల్లో అభిషేక్ శర్మ సెంచరీ… రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ !
అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన పై మాజీ క్రికెటర్లు, క్రీడాభిమానుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వెళ్ళువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ బౌలర్లపై దండయాత్ర చేసిన అభిషేక్ శర్మని అతడి కోచ్, మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ { Yuvraj Singh} ప్రశంసల్లో ముంచేత్తారు. అద్భుతంగా ఆడావని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే ఆటను తాను చూడాలనుకుంటున్నానని, గర్వంగా ఉందని ట్వీట్ చేశాడు యువరాజ్ సింగ్.
Well played @IamAbhiSharma4! That's where I want to see you! 🔥 Proud of you 👊🏻💯#IndVSEng
— Yuvraj Singh (@YUVSTRONG12) February 2, 2025